Skip to main content

MPC Course Benefits : ఇంట‌ర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగాలు ఇవే..

పదో తరగతి.. విద్యార్థి జీవితంలో కీలక దశ. దీన్ని విజయవంతంగా దాటాక ఎంపిక చేసుకున్న మార్గమే విద్యార్థి కెరీర్‌ను నిర్దేశిస్తుంది. టెన్త్ తర్వాత విద్యార్థులకు ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, ఐటీఐ.. ఇలా వివిధ కోర్సులు అందుబాటులో ఉంటాయి.
MPC Course Benefits
mpc course benefits

మ్యాథమెటిక్స్ అంటే అమితాసక్తి ఉండి, ఒక సమస్యను విశ్లేషించి, వేగంగా సాధనను కనుక్కొనే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఈ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసిన విద్యార్థులు ఇంట‌ర్‌లో ఎంపీసీ గ్రూప్ తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు ఉన్న‌యో తెలుసుకుందామా..!

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

ఎంపీసీ గేట్ వే.. రైట్ వే..!
ఈ గ్రూప్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థులకు నిరంతర అధ్యయనం, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి సమకాలీన పరిణామాలపై అవగాహన అవసరం. సివిల్, మెకానికల్ వంటి సంప్రదాయ విభాగాలతో పాటు జియోటెక్నికల్, నానో ఇంజనీరింగ్ వంటి అధునాత బ్రాంచ్‌ల సమ్మేళనంగా ఉన్న ఇంజనీరింగ్‌లో కెరీర్‌ను సుస్థిరం చేసుకునేందుకు ఎంపీసీ గేట్ వే! ఇంటర్ పూర్తయ్యాక రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరొచ్చు. జేఈఈ-మెయిన్ ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీ, ఐఎస్‌ఎం ధన్‌బాద్‌లో ప్రవేశించొచ్చు. ఇంజనీరింగ్‌పై ఆసక్తి లేకుంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో సంబంధమున్న విభాగాల్లో ఉన్నత విద్య, పరిశోధనల దిశగా కూడా వెళ్లొచ్చు. 

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

యూజీ స్థాయిలో అయితే..
ఎంపీసీ తర్వాత యూజీ స్థాయిలో బీఎస్సీ పూర్తిచేశాక ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అందుకోవచ్చు. అయితే సహనం ప్రధానం. ఓర్పు, నేర్పు ఉంటే కొంత అధిక సమయం తీసుకున్నా ఉజ్వల కెరీర్ ఖాయం. ఆర్ అండ్ డీ సెంటర్లు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, బెవరేజెస్ కంపెనీలు వంటివి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా పీజీ/పీహెచ్‌డీ అర్హతతో శాస్త్రవేత్తలుగా, సైంటిఫిక్ అసిస్టెంట్‌గా అవకాశాలు ఉంటాయి.

Central Government Jobs: పదితోనే కేంద్ర కొలువు.. పూర్తి వివ‌రాలు ఇలా..

ఇంజనీరింగ్‌కు రాచ‌బాట‌..
☛ రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సులో ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదువుతారు.
☛ ఈ గ్రూప్‌లో అకడమిక్‌గా రాణించాలంటే.. కొన్ని సహజ నైపుణ్యాలు అవసరం. మ్యాథ్స్‌పై ఆసక్తితో పాటు కంప్యుటేషనల్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్, పుస్తకాల్లో చదివిన సైన్స్ అంశాలను అన్వయించ గలిగే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్.. ఎంపీసీ.
☛ ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ప్రధాన లక్ష్యం.. ఇంజనీరింగ్. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ తదితర ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి బీటెక్ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు.
☛ ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా.. ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, సీఏ/సీఎస్/సీఎంఏ తదితర ప్రొఫెషనల్ కోర్సులు, డైరీ టెక్నాలజీ, లా, డిజైన్ కోర్సులు, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ.. ఇలా అనేక ఉన్నత విద్యావకాశాలకు ఎంపీసీ గ్రూప్ అర్హతగా నిలుస్తోంది.
☛ వాస్తవానికి ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు మెడిసిన్ తప్ప.. ఏ కోర్సులోనైనా చేరేందుకు అర్హులని చెప్పొచ్చు.
☛ ఎన్‌డీఏ, ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం వంటి పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా బ్యాచిలర్ డిగ్రీతోపాటు డిఫెన్స్ రంగంలో కెరీర్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు.
☛ ఇవి కాకుండా భవిష్యత్తులో సైన్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే... బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత పలు రీసెర్చ్ కోర్సుల్లో చేరేందుకు అవకాశముంది.
ఎంపీసీ పూర్తిచేసిన వారు టీచింగ్ కెరీర్‌పై ఆసక్తి ఉంటే డైట్‌సెట్ ద్వారా డీఈడీ కోర్సులో చేరొచ్చు.

ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

Published date : 07 Jun 2022 05:47PM

Photo Stories