Skip to main content

అమ్మఒడిపథకం..30 లక్షల మందికి పైగా ఖాతాల్లోకి సొమ్ము

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది కుటుంబాల్లో ముందే సంక్రాంతి పండుగొచ్చింది. జగనన్న అమ్మఒడి పథకం డబ్బులు ఖాతాల్లో పడడంతో జనవరి 10 (శుక్రవారం)నబ్యాంకుల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో చిన్నారులెవరూ బడిబయట ఉండకూడదని, పేదల ఇళ్లలో చదువుల వెలుగులు విరజిమ్మాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు అమలు చేస్తున్న అమ్మఒడిలో రూ. 15 వేలు ఖాతాల్లో పడడంతో.. వందలు, వేల సంఖ్యలో మహిళలు బ్యాంకులకు క్యూ కట్టారు. తమ ఖాతాల్లో డబ్బుపడిందని తెలుసుకున్న వారి మోముల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ఇక ఇళ్లలో చిన్నారులు సందడిచేస్తూ.. ఇది జగన్ మామ మా చదువుకు కోసం అమ్మకు ఇచ్చిన డబ్బులు అంటూ ఉప్పాంగిపోయారు. తమ ఖాతాల్లో నిధులు జమచేయడంపై తల్లులు స్పందిస్తూ.. నాలుగైదు రోజుల ముందే మా కుటుంబాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఖాతాల్లో నిధులు పడటంతో మహిళలు సెల్‌ఫోన్లలో సమాచారం పంచుకుంటూ మురిసిపోయారు. చాలా చోట్ల స్వీట్లు పంచుకుని.. జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
రికార్డు సృష్టించిన అమ్మఒడి
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమైనట్లు చాలామంది తల్లులకు సెల్‌ఫోన్లలో మెసేజ్ అందింది. అలా మెసేజ్ రానివారు.. మెసేజ్ వచ్చినా డబ్బు అకౌంట్‌లో పడిందా? అని తెలుసుకునేందుకు వచ్చినవారితోనూ శుక్రవారం బ్యాంకులన్నీ కిటకిటలాడారుు. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు శాఖలు కిక్కిరిసిపోయారుు. గురువారం చిత్తూరు జిల్లాలో పథకానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టగా.. 24 గంటల్లోపే నిధులు ఖాతాల్లో జమ కావడంపై తల్లులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభమైన 24 గంటల్లోనే 30 లక్షల మంది పైగా తల్లుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమకాగా.. మిగతా వారికి ఒకట్రెండు రోజుల్లో జమకానుంది. ‘రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఇంత వరకూ పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోగా ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు నిధులు జమ చేసిన సంఘటనలు నాకు తెలిసినంత వరకూ లేవు. ఈ రకంగా అమ్మ ఒడి పథకం రికార్డు సృష్టించింది’ అని ఎస్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.

లబ్ధిదారుల జాబితాలో దాదాపు 43 లక్షల మంది
{పభుత్వ, ప్రైవేటు, అన్‌ఎరుుడెడ్, ఎరుుడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ పిల్లల్ని చదివిస్తున్న దాదాపు 43 లక్షల మంది తల్లులను ప్రభుత్వం అమ్మఒడి పథకంలో లబ్ధిదారులుగా గుర్తించింది. ఆన్‌లైన్ ద్వారా వీరి ఖాతాల్లో జమ చేసేందుకు రూ. 6,456 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

జిల్లాల వారీగా లబ్ధిపొందిన వారు
శ్రీకాకుళం 2,41,562
విజయనగరం 2,12,454
విశాఖపట్నం 3,92,907
తూ.గోదావరి 4,57,222
ప.గోదావరి 3,35,359
కృష్ణా 3,43,285
గుంటూరు 3,90,567
ప్రకాశం 2,84,624
నెల్లూరు 2,20,607
కడప 2,55,587
కర్నూలు 3,77,662
అనంతపురం 3,62,579
చిత్తూరు 3,30,540
లబ్ధి పొందినఅనాథ పిల్లలు 7231
Published date : 11 Jan 2020 02:52PM

Photo Stories