Good News For VRO and VRA Employees : తెలంగాణ‌లో వీఆర్వోలు మళ్లీ వ‌స్తున్నారు.. ఎలా అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి.., అప్పటికే విధుల్లో ఉన్నవాళ్లను వివిధ శాఖల్లోకి అడ్జస్ట్ చేసిన విష‌యం తెల్సిందే.

అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి వీఆర్వోలను మళ్ళీ నియమించబోతోంది. అయితే ఈ వీఆర్వోలను ఇపుడు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్లు గా పేరు మార్పు చేయనున్నట్టు తెలుస్తోంది.

☛ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

25,750 వీఆర్వో, రెవెన్యూ సహాయకులకు..
2020 అక్టోబర్‌కు ముందు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25,750 వీఆర్వో, రెవెన్యూ సహాయకులు ఉండేవారు. అయితే గ్రామ స్థాయిలో చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రభుత్వ దృష్టికి రావడంతో తిరిగి వీరందరిని వీఆర్వోలుగా నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామ పంచాయితీలు ఉండగా.., డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని ఈ పోస్టుల్లోకి తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది.

#Tags