Civils 780th Ranker Uday Krishna Reddy: ఒకప్పుడు కానిస్టేబుల్‌, ఇప్పుడు సివిల్స్‌ టాపర్‌..ఉదయ్‌కృష్ణారెడ్డి జర్నీ చూస్తే..

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టుదలతో  కష్టపడి చదివాడు.. సివిల్స్‌ ర్యాంకు సాధించాడు. తన కోసం నానమ్మ పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించుకునేందుకు ఎంతో కృషి చేశాడు. తన లక్ష్యసాధనలో సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి.

వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి గతంలో సాధారణ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించేవాడు. కానీ పట్టుదలతో చదివి యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షలో 780వ ర్యాంకు సాధించాడు. ఈ దర్భంగా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునిల్‌ స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం ఉదయ్‌ కృష్ణా రెడ్డిని సన్మానించారు.

► UPSC CSE-2023 Ranker Pranay Kumar : సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతోనే చ‌దివా.. ఎట్ట‌కేల‌కు 554వ ర్యాంక్ కొట్టానిలా.. కానీ..

ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత ఉదయ్‌ కృష్ణా రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తాను 2013 నుంచి 2018 వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు పోలీస్‌ స్టేషన్‌, రామాయపట్నం మైరెన్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించానన్నారు.

ఐఏఎస్‌ సాధించిన రేవు ముత్యాల రాజును స్పూర్తిగా తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యానన్నారు. అందుకోసం 2018లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో చదివానన్నారు. తన చిన్నప్పుడే తల్లి దండ్రులు చనిపోయారని, నాయనమ్మ రమణమ్మ తనను తీర్చిదిద్దారని చెప్పారు.
 

#Tags