UPSC CAPF Notification 2024: డిగ్రీ అర్హతతో అసిస్టెంట్‌ కమాండెంట్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (UPSC) సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB)లో 506 అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఎ) పోస్టుల భర్తీకి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024 నిర్వహిస్తోంది.

ఖాళీలు..
బీఎస్‌ఎఫ్‌ - 186
సీఆర్‌పీఎఫ్‌ - 120
సీఐఎస్‌ఎఫ్‌ - 100
ఐటీబీపీ - 58
ఎస్‌ఎస్‌బీ - 42
మొత్తం: 506

అర్హత..
➢ బ్యాచిలర్ డిగ్రీ
➢ నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు
వయోపరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు.

SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో 327 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ఎంపిక ప్రక్రియ..
➢ రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2)
➢ ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
➢ మెడికల్ ఎగ్జామినేషన్
➢ ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్
➢ డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14-05-2024
దరఖాస్తు సవరణ: 15-05-2024 నుంచి 21-05-2024 వరకు ఉంది.
రాత పరీక్ష తేదీ: 04-08-2024

వెబ్‌సైట్: https://upsc.gov.in/

 

#Tags