స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
UPSC CMS 2024 Notification: 827 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలో రాణించే మార్గాలు ఇవే..

- యూపీఎస్‌సీ సీఎంఎస్‌ఈ-2024 నోటిఫికేషన్ విడుదల
- కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌లు
- మొత్తం నాలుగు విభాగాల్లో 827 ఉద్యోగాల భర్తీ
- ప్రారంభ వేతన శ్రేణి రూ.56,100-రూ.1,77,500
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు.. ఆ తర్వాత పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తేనే.. కెరీర్‌లో నిలదొక్కుకునే పరిస్థితి ఉంది. కాని సీఎంఎస్‌ఈ ద్వారా ఎంబీబీఎస్‌తోనే సుస్థిర కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
మొత్తం 827 పోస్ట్‌లు
యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన సీఎంఎస్‌ఈ-2024 నోటిఫికేషన్ ఫ్రకారం- కేంద్ర ఆరోగ్య శాఖ పరధిలోని నాలుగు విభాగాల్లో మొత్తం 827 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌లను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. ఇందులో కేటగిరీ -1లో సెంట్రల్ హెల్త్ సర్వీస్ సబ్ కేడర్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్-163 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కేటగిరీ-2లో.. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల ఆఫీసర్ పోస్టులు 450; న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 14, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 200 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు
ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా.. కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్‌లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరికి ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాకే అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తారు.
వయసు
ఆగస్ట్1, 2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో సబ్‌కేడర్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌ల అభ్యర్థులకు 2024, ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పు న గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఆకర్షణీయ వేతనాలు
ఎంపికై కొలువులో చేరిన వారికి పే లెవల్-10తో ప్రారంభ వేతనం ఉంటుంది. వేతన శ్రేణి రూ.56,100 - రూ.1,77,500 లభిస్తుంది.
రెండు దశల ఎంపిక ప్రక్రియ
సీఎంఎస్‌ఈ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలిదశలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రతిభ ఆధారంగా మలిదశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
చదవండి: CMSS Recruitment 2024: సీఎంఎస్‌ఎస్ లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
తొలి దశ రాత పరీక్ష
- సీఎంఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్ష రెండు పేపర్లుగా 500 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు కేటాయించారు. అవి..
- పేపర్-1: జనరల్ మెడిసిన్ అండ్ పిడియాట్రిక్స్. ఈ పేపర్‌లో జనరల్ మెడిసిన్ నుంచి 96 ప్రశ్నలు, పిడియాట్రిక్స్ నుంచి 24 ప్రశ్నలు అడుగుతారు. ఇలా మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి.
- పేపర్-2ను మూడు భాగాలుగా వర్గీకరించారు. అవి.. ఎ) సర్జరీ; బి) గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్; సి) ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లలోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
మలిదశలో పర్సనాలిటీ టెస్ట్
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. అభ్యర్థుల్లోని జనరల్ నాలెడ్జ్‌ను, వైద్య రంగం పట్ల వారికున్న సేవా దృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని, నాయకత్వ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే తుది జాబితాలో చోటు సాధింస్తే.. కొలువు ఖరారైనట్లే!
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 30
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: మే 1 నుంచి మే 7 వరకు
- సీఎంఎస్‌ఈ పరీక్ష తేదీ: 2024, జూలై 14
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
- వెబ్‌సైట్: https://upsc.gov.in/
రాత పరీక్షలో రాణించే మార్గం
- రెండు పేపర్లుగా నిర్వహించే తొలిదశ రాత పరీక్షలో రాణించేందుకు అభ్యర్థులు ఎంబీబీఎస్ అకడమిక్స్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది.
- పేపర్-1(జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్)లో కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, జెనిటో యూరినరీ, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రినాలజీ, మెటబాలిక్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్-కమ్యూనికబుల్ డిసీజెస్, న్యూట్రిషన్/గ్రోత్, డెర్మటాలజీ, మస్కులో-స్కెలిటిల్ సిస్టమ్, సైకియాట్రీ, జనరల్ మెడిసిన్‡తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.అదే విధంగా పిడియాట్రిక్స్‌కు సంబంధించి కామన్ చైల్డ్‌హుడ్ ఎమర్జెన్సీస్, న్యూబార్న్ కేర్, నార్మల్ డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్, ఇమ్యునైజేషన్ ఇన్ చిల్డ్రన్, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను గుర్తించడం, వారికి కల్పించే చికిత్స మార్గాలు, విధానాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
పేపర్-2కు ఇలా
- పేపర్-2లోని మూడు విభాగాలకు సంబంధించి దృష్టి పెట్టాల్సిన అంశాలు..
- సర్జరీ: జనరల్ సర్జరీకి సంబంధించి గాయాలు, కాలేయం, రక్త నాళాలు, పేగులు, కణితులు, ఉదర సంబంధ సమస్యలు తదితరాలకు సంబంధించిన శస్త్రచికిత్సల అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు యూరలాజికల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఈఎన్‌టీ సర్జరీ, థొరాసిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, ఆఫ్తమాలజీ, అనస్థీసియాలజీ, ట్రామటాలజీ అంశాలను ఔపోసన పట్టాలి.
- గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్: ఈ విభాగానికి సంబంధించి గైనకాలజీలో అప్లయిడ్ అనాటమీ, అప్లయిడ్ ఫిజియాలజీ, జెనిటల్ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్లు, నియాప్లాస్మా, గర్భాశయం స్థానంలో మార్పులు, కన్వెన్షనల్ కాంట్రాసెప్టివ్స్, యూడీ, ఓరల్ పిల్స్, ఆపరేటివ్ ప్రొసీజర్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్: ఈ విభాగంలో మంచి మార్కుల కోసం సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, డిసీజ్, ప్రివెంటివ్ మెడిసిన్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, డెమోగ్రఫీ అండ్ హెల్త్ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్, న్యూట్రిషన్ అండ్ హెల్త్, ఆక్యుపేషనల్ హెల్త్, జెనిటిక్స్ అండ్ హెల్త్, ఇంటర్నేషనల్ హెల్త్, మెడికల్ సోషియాలజీ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, నేషనల్ ప్రోగ్రామ్స్ అంశాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి.
సమకాలీన సమస్యలపైనా
అభ్యర్థులు సమకాలీన ఆరోగ్య సమస్యలపైనా దృష్టిసారించాలి. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సీన్లు, వ్యాక్సీన్ ప్రయోగాలు తదితర అంశాల గురించి సమాచారం తెలుసుకోవాలి. అదే విధంగా అంతర్జాతీయంగా కోవిడ్ ప్రభావానికి గురైన దేశాలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు, నివేదికలు, యూఎన్‌ఓ నివేదికల్లోని ముఖ్యాంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.
అకడెమిక్స్‌పై పట్టు
రాత పరీక్షలో మెరుగ్గా రాణించడానికి అభ్యర్థులు తమ అకడమిక్ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ముందుగా పరీక్ష సిలబస్‌ను పరిశీలించి.. అకడమిక్స్‌లోని అంశాలతో బేరీజు వేసుకుంటూ అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదవాలి. అదే విధంగా పాత ప్రశ్న పత్రాల సాధన కూడా ఉపకరిస్తుంది.
ప్రొబేషన్ నిబంధన
ఇండియన్ రైల్వేస్‌లో ఒక ఏడాది, మిగిలిన విభాగాల్లో రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. ఇండియన్ రైల్వేస్‌లో ప్రొబేషన్‌తో పాటు ఫౌండేషన్ కోర్సు విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న వారిని జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్లుగా శాశ్వత ప్రాతిపదికగా విధుల్లోకి తీసుకుంటారు.
- సీఎంఎస్‌ఈ ద్వారా ఆయా విభాగాలకు ఎంపికైన వారు భవిష్యత్తులో పదోన్నతులతో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.
చదవండి: UPSC IES/ISS Notification 2024: IES/ISS పోస్టుల వివరాలు.. సబ్జెక్ట్ పేపర్లకు సన్నద్ధత ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :