TSPSC Group-1 Syllabus: గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ తెలుగులో... 6 పేపర్లు 900 మార్కులు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి భారీగా గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 18 విభాగాల్లో మొత్తం 563 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేష‌న్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే.

ఈ సారి ఇంటర్వ్యూల రద్దుతో రెండంచెల(ప్రిలిమ్స్, మెయిన్స్‌) విధానంలో ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 సిల‌బ‌స్‌పై స‌మ‌గ్ర విశ్లేష‌ణ మీకోసం..

Group 1 & 2 : సిలబస్‌ దాదాపు ఒక్కటే.. ఈ చిన్న మార్పులను గమనిస్తే..: కె.సురేశ్‌ కుమార్‌ గ్రూప్‌–1 విజేత

గ్రూప్స్‌ పరీక్షల కొత్త విధానం ..

గ్రూప్‌ ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూల(మౌఖిక పరీక్షలు)ను తొలగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ 150 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పరీక్ష ఉంటుంది. ముందుగా ప్రిలిమినరీ టెస్ట్‌లో అర్హత సాధించిన వారు మెయిన్‌  పరీక్షకు ఎంపికవుతారు. 900మార్కులతో గ్రూప్‌–1 మెయిన్‌ రాత పరీక్ష ఉంటుంది. మెయిన్‌లో ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?  

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 900

సబ్జెక్ట్‌ సమయం (గంటలు) గరిష్ట మార్కులు 
ప్రిలిమినరీ టెస్ట్‌ (జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ) 2 1/2 150
రాత పరీక్ష (మెయిన్‌ ) (జనరల్‌ ఇంగ్లిష్‌)(అర్హత పరీక్ష) 3 150

మెయిన్‌ పేపర్‌–1 జనరల్‌ ఎస్సే

  1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
  2. ఆర్థికాభివృద్ధి మరియు న్యాయపరమైన (జస్టిస్‌) సమస్యలు
  3. డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
  4. భారతదేశ చారిత్రక మరియు సాంస్కతిక వారసత్వ సంపద
  5. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి
  6. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి
3 150
పేపర్‌–2 హిస్టరీకల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ      
  1. భారతదేశ చరిత్ర మరియు సంస్కతి (1757–1947)
  2. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద
  3. జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
3 150
పేపర్‌–3  ఇండియన్‌  సొసైటీ, కానిస్టిట్యూషన్‌  అండ్‌ గవర్నెన్స్‌  
  1. భారతీయ సమాజం, నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం
  2. భారత రాజ్యాంగం
  3. పాలన
3 150
పేపర్‌–4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌            
  1. భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు
3 150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌     
  1. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
  2. మెడరన్‌  ట్రెండ్స్‌ ఇన్‌  అప్లికేషన్‌  ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
  3. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌  అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
3 150
పేపర్‌–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం 
  1. ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఆలోచన 1948–1970)
  2. మొబిలైజేషన్‌ ఫేజ్‌ (మద్దతు కూడగట్టే దశ 1971–1990)
  3. టువర్డ్స్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఏర్పాటు దిశగా 1991–2014)
3 150

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

#Tags