Competitive Exam Best Success Tips : ఏ పోటీ పరీక్షకైన ఇలా చదివితే ఉపయోగం ఉండ‌దు.. ఇలా చ‌దివితేనే..

నేను ప‌దో త‌ర‌గ‌తి ఫెయిలైనా నిరాశపడకుండా ప్రయత్నించి కలెక్టర్‌ అయ్యారు. ప‌దిలో ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టుల్లో ఫెయిలై, ట్యూషన్‌కు వెళ్లి రెండేండ్లకు పాసయ్యారు.
IAS L Sharman

సివిల్స్‌లో మూడుసార్లు ఇంటర్వ్యూ, గ్రూప్‌-1లో ఒకసారి విఫలమై గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయి 3వ ర్యాంక్‌ సాధించి.. తన కల ఐఏఎస్‌ సాధించారు ఎల్‌ శర్మన్‌. ఈ నేప‌థ్యంలో వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం స‌క్సెస్ టిప్స్ మీకోసం..

APPSC Group 1 Ranker Sreenivasulu Raju : గ్రూప్‌-1 స్టేట్ 2nd ర్యాంక‌ర్ స‌క్సెస్ స్టోరీ..|| నేను చదివిన పుస్తకాలు ఇవే..

కిందపడ్డ ప్రతిసారీ..ఈ కసితోనే..
తొలి ప్రయత్నంలో గ్రూప్‌-1 మిస్సయ్యాను. సివిల్స్‌లో మూడుసార్లు ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. కిందపడ్డ ప్రతిసారీ పైకి లేవాలన్న కసితో ప్రయత్నించి అనుకున్నది సాధించాను. ప్రయత్నాన్ని ఎప్పుడూ విరమించుకోవద్దు. ఒకటి పోతే మరో ఉద్యోగం వస్తుంది. సెంట్రల్‌ ఎక్సైజ్‌లో ఇన్‌స్పెక్టర్‌, పోస్టల్‌, బ్యాంక్‌ ఉద్యోగాలకు ఎంపికై చివరికి గ్రూప్‌-1తో ఆపేశాను. అభ్యర్థులకు పాజిటివ్‌ దృక్పథం, ఆత్మవిశ్వాసం ముఖ్యం. సంకల్పం, క్రమశిక్షణ, లక్ష్యం సాధించాలన్న తపన ఉండాలి. 

TSPSC గ్రూప్‌–3 పరీక్షా విధానం ఇదే!

గ్రూప్‌-1లో సులభంగా సక్సెస్ అయ్యానిలా..

అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. సివిల్స్‌లో ఒకసారి 250 మార్కులకు 80 మార్కులే వచ్చాయి. ఇంకో 20 మార్కులొస్తే ఐఏఎస్‌ అయ్యేవాడిని. తృటిలో కోల్పోయాను. ఇంటర్వ్యూలో సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోవడం వల్లే ఇలా జరిగిందని అనుకొంటా. అదే గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో 111 మార్కులొచ్చాయి. అంటే అడిగే ప్రశ్నలను బట్టి మార్కులొస్తాయి. సివిల్స్‌లో కఠినంగా అడిగారు, ఆన్సర్ చేయలేకపోయాను. అదే గ్రూప్‌-1లో సులభంగా సమాధానాలు చెప్పి సక్సెస్‌ సాధించాను.గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తాము తెలుగు మీడియం వాళ్లమని బాధపడొద్దు. నేనే కాదు, నాలాంటి చాలామంది తెలుగు మీడియంలో చదివి సక్సెస్‌ సాధించారు. సివిల్స్‌లోనూ తెలుగు మీడియం అభ్యర్థులు కూడా విజయం సాధిస్తున్నారు. ఏ మీడియంలో చదివినా.. ప్రశ్నలను అర్థం చేసుకొని, అప్పటికప్పుడు సమాధానాలు రాసేలా సిద్ధమవ్వాలి.

TSPSC పరీక్షా విధానంలో మార్పులు.. 900 మార్కులతో గ్రూప్‌ 1

ఇలా చ‌దివితే ఈజీనే.. కానీ
అభ్యర్థులు అదేపనిగా చదవొద్దు. మధ్యలో కాస్త విరామం తీసుకొని, తిరిగి కొనసాగించాలి. 18 గంటలు కష్టపడ్డామని.. చాలామంది అంటుంటారు. ఇది సరికాదు. నేను మధ్యమధ్యలో గేమ్స్‌ ఆడేవాడిని, సినిమాలు చూసేవాడిని, టేబుల్‌ టెన్నిస్‌, షటిల్‌ వంటి వాటి ద్వారా విశ్రాంతి పొందేవాడిని. మిత్రులతో గ్రూప్‌ డిస్కషన్స్‌ చేసేవాడిని. ఈ టెక్నిక్స్‌ నాకు ఉపకరించాయి. సమయానికి తినడం, చదవడం, పడుకోవడం అలవర్చుకోవాలి. పోటీ పరీక్షల్లో నెగ్గిన విజేతలతో ముఖాముఖి కలుసుకొని మాట్లాడాలి. వారిని కలిసి ప్రిపరేషన్‌ ప్లాన్‌ను తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్పష్టత వస్తుంది. ధైర్యాన్నిస్తుంది.

చదవండి: DSP Yegireddi Prasad Rao : ఆయ‌న కష్టాలను కళ్లారా చూశాడు..డీఎస్పీ అయ్యాడు..

ఇలా చదివితే ఉపయోగం ఉండ‌దు..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వాతావరణం ముఖ్యం. ప్రశాంతమైన వాతావరణంలో ప్రిపరేషన్‌ సాగించాలి. మనతో ఉండే సమూహం కూడా ముఖ్యమే. మేం ప్రిపేరయ్యేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అందరికీ ఆశ్రయమిచ్చింది. ఏ హాస్టల్‌కెళ్లినా, ఎక్కడ చూసినా పోటీపరీక్షలకు ప్రిపేరయ్యేవాళ్లే కనిపించేవారు. ఏ రిజల్ట్స్‌ వచ్చినా 30 శాతం ఉద్యోగాలు ఓయూ వాళ్లే దక్కించుకొనేవాళ్లు. దీంతో కసి, పట్టుదల మరింత పెరిగేది. ప్రిపరేషన్‌ ప్రారంభంలో కఠినమైన సబ్జెక్టులు, కొత్త సబ్జెక్టులు ముందు చదవాలి. పరీక్షలు సమీపించాక కఠినమైనవి చదివితే ఉపయోగం ఉండదు. సిలబస్‌ పూర్తిచేయడం కష్టం. ఒక అంశానికి సంబంధించిన పుస్తకాన్ని చదివాక, అదే అంశానికి సంబంధించిన మరో పుస్తకాన్ని కొని, మళ్లీ చదవొద్దు. దీంతో సమయం వృథా అవుతుంది.

TSPSC గ్రూప్‌–2 పరీక్ష 600 మార్కులకు కుదింపు... పరీక్షా విధానం ఇదే!

#Tags