TGPSC Exams Schedule 2024 : TSPSC పరీక్షలన్నీ ఈ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం.. కానీ..
ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆయన చెప్పారు.TSPSC పరిధిలోని పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఈయన స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మాయమాటలు చెబితే నమ్మవద్దని సూచించారు. నిరుద్యోగుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు.
☛➤ TSPSC Jobs Notifications 2024 : 21 నోటిఫికేషన్లు.. 12,403 ఉద్యోగాలకు..! ఇంకా..
కీలకంగా మారనున్న గ్రూప్ పరీక్షలు.. ఫలితాలు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1, 3 పరీక్షలు ఇటీవలే పూర్తైన విషయం తెల్సిందే. అలాగే డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. తొలుత గ్రూప్-1 ఫలితాలను.., ఆ తర్వాత గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసి.. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. చివర్లో గ్రూప్-3 ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని గ్రూప్స్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.