Free Coaching: స్టడీ సర్కిళ్లు సిద్ధం.. వీరు అర్హులు..

కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు ఉచిత శిక్షణకు సిద్ధమవుతున్నాయి.

ఎస్టీ అభ్యర్థులకు సైతం గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనుండగా, స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికై న నిరుద్యోగులకు ఉపకార వేతనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్‌ శిక్షణ కేంద్రాలకు వెళ్లలేని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉద్యోగార్థులకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ స్టడీ సర్కిళ్లు ఇప్పటికే వాట్సాప్‌, టెలిగ్రాం యాప్‌ల ద్వారా శిక్షణ ఇస్తుండగా, ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.

బీసీ స్టడీ సర్కిల్‌ పరిధిలో

వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బీడీ స్టడీ సర్కిల్‌ ద్వారా గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సర్కిల్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఉజ్వలపార్క్‌ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టడీ సర్కిల్‌ నిర్మించారు. ఇందులో గ్రూప్‌ –1,2,3,4తో పాటు డీఎస్సీలో భాగంగా ఎస్‌జీటీ, బ్యాంకింగ్‌, ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్‌ కోసం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

వీరు అర్హులు

దరఖాస్తుదారులు తప్పనిసరిగా డిగ్రీ 50శాతం మా ర్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్‌, పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలతో రా వాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలకు మించకూడదు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 0878– 2268686 ఫోన్‌ నంబర్‌లోగాని, పని వేళల్లో బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలోగాని సంప్రదించాలని డైరెక్టర్‌ రవికుమార్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎస్సీ స్టడీ సర్కిల్‌లో

అంబేద్కర్‌ స్టడీ మెమోరియల్‌ ద్వారా ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్ల మార్గదర్శనంలో ఎస్సీ అభివృద్ధిశాఖ ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌–1, 2, 3, 4 పరీక్షల కోసం శిక్షణ ఇస్తున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ బండ శ్రీనివాస్‌ తెలిపారు. ఐదు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్ల్లు తెలిపారు.

ఇప్పటివరకు కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలకు చెందిన 603 మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 6లోగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. డీఎస్సీ నియామాకం కోసం జరిగే పరీక్షకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణ, రెసిడెన్షియల్‌ పద్ధతిలో భోజన వసతి కల్పించనున్నట్లు, అభ్యర్థులు ఈనెల 26లోగా స్టడీ సర్కిల్‌లో సంప్రదించాలని సూచించారు.

మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో

గ్రూప్‌–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీ అభ్యర్థుల నుంచి ఉచిత కోచింగ్‌ కోసం దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమశాఖ అధికారి పవన్‌కుమార్‌ వెల్లడించారు. 45 రోజు ల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని, ఆసక్తి కలిగి న మైనార్టీ అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ దరఖాస్తు ఫారం, రెండు ఫొటోలు, స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను జతచేసి కలెక్టర్‌ కార్యాలయంలోని మైనార్టీ సంక్షేమశాఖ ఆఫీసులో సమర్పించాలని కోరారు. వివరాలకు 98491525 16 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

#Tags