TSPSC Question Paper Leak Breaking News : ఒక‌టి కాదు.. రెండు కాదు.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (AE) కొశ్చ‌న్ పేప‌ర్ కూడా లీక్‌.. ఇంకా అనుమానాలు ఎన్నో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం సంచలనంగా మారిన విష‌యం తెల్సిందే.
TSPSC exam paper leakage case details

ఇప్పుడ మ‌రో సంచ‌న‌ల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5వ తేదీన జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (AE) పరీక్ష పత్రం కూడా లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు నిర్ధారించారు. పరీక్ష పత్రాల లీకేజీ నేపథ్యంలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే యోచనలో కనిపిస్తోంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షల విష‌యంలో ఇంకా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

☛➤ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ విచారణలో కీలక అంశాలను..

ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడైన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. ఓ యువతి సోదరుడి కోసం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్‌ పేపర్‌ లీక్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్న రేణుక అనేక యువతి తన తమ్ముడి కోసం పేపర్‌ లీక్‌ చేయించింది. దీంతో నెట్వర్క్ అడ్మిన్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న రాజశేజర్‌ను పేపర్ గురించి ప్రవీణ్‌ అడిగాడు. టౌన్ ప్లానింగ్ పేపర్‌ సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్‌లో ఉందని రాజశేఖర్‌ చెప్పగా.. ప్రవీణ్‌ తన పెన్‌డ్రైవ్‌లో పేపర్‌ను కాపీ చేసుకున్నాడు. దీనిని పేపర్‌ ప్రింట్‌ తీయించి రేణుకకు ఇచ్చాడు. పేపర్‌ను తన సోదరుడికి చూపించి వెంటనే తెచ్చి ఇవ్వమని ఆమెను ఆదేశించాడు. 

☛➤ TSPSC Groups Applications 2023 : గ్రూప్-2, 3, 4 పోస్టులకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే...? ఈ కామన్‌ సిలబస్ చ‌దివితే..

రూ.14 లక్షల వరకు..
అయితే డబ్బు మీద ఆశతో రేణుక క్వశ్చన్‌ పేపర్‌ను ఓ సర్పంచ్‌ కొడుక్కి పంపింది. ఆ వ్యక్తి.. మరో ముగ్గురు యువకులకు చెప్పడంతో వాళ్ల నుంచి రేణుక రూ.14 లక్షల వరకు డబ్బుల‌ను వసూలు చేసింది. దీంట్లో రూ.10 లక్షల రూపాయలను ప్రవీణ్‌కు ఇచ్చింది. అనంతరం ప్రింట్ ఇచ్చిన పేపర్లను ప్రవీణ్ కాల్చి వేసినట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. డబ్బులు వ్యవహారంలో సఖ్యత కుదరకపోవడంతో ఓ అభ్యర్థి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వాట్సప్‌ ద్వారా..

టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్ష ప్రశ్నపత్రాలను కమిషన్‌ ఇటీవల సిద్ధం చేసింది. ఇవన్నీ డిజిటల్‌ ఫార్మాట్‌లో కమిషన్‌ కార్యాలయంలోని ఒకరిద్దరు అధికారుల కంప్యూటర్లలో ఉంటాయి. వాటికి యూజర్‌ఐడీ, పాస్‌వర్డులు ఉంటాయి. ఇతరులు తెరిచే అవకాశం లేదు. కానీ, కార్యదర్శి పీఏ కావడంతో ప్రవీణ్‌కు వీటి గురించి కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. కమిషన్‌లో ఇటీవల కంప్యూటర్లన్నీ అప్‌గ్రేడ్‌ చేశారు. ఆ సమయంలో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ను టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న టీఎస్‌టీఎస్‌ పొరుగుసేవల ఉద్యోగి ఒకరు తస్కరించినట్లు అనుమానిస్తున్నారు. టీఎస్‌టీఎస్‌ పొరుగుసేవల ఉద్యోగి, సిస్టమ్‌ అనలిస్టు రాజశేఖర్‌ సాయంతో కార్యదర్శి సెక్షన్‌లోని కంప్యూటర్‌ ద్వారా లాగిన్‌ అయిన ప్రవీణ్‌ ప్రశ్నపత్రాల్లోని సమాచారాన్ని సేకరించి.. వాట్సప్‌ ద్వారా ఉపాధ్యాయినికి చేరవేశాడు.

☛➤ TSPSC Exams Postponed 2023 : షాకింగ్ న్యూస్‌.. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా.. కార‌ణం ఇదే

#Tags