TET/DSC Telugu Methodology Bitbank: విద్యార్థులకు పఠన నైపుణ్యం ఏ విధంగా అలవడుతుంది?
1. భాషా నైపుణ్యాలకు మరోపేరు?
1) స్పష్టీకరణలు
2) ప్రాతిపదిక లక్ష్యాలు
3) బోధనా నైపుణ్యాలు
4) బోధనాభ్యసన సూత్రాలు
- View Answer
- Answer: 2
2. భాషా నైపుణ్యాల్లో కఠినతరమైంది ఏది?
1) శ్రవణం
2) భాషణం
3) పఠనం
4) లేఖనం
- View Answer
- Answer: 4
3. ‘పఠనం కంటే లేఖనం సులువైన నైపుణ్యం’ అని పేర్కొన్న విద్యావేత్త?
1) బ్రూనర్
2) రైబర్న్
3) మాంటిస్సోరి
4) ప్రోబెల్
- View Answer
- Answer: 3
4. ‘నయనమితి’ ఏ పఠనానికి ఉపయోగపడుతుంది?
1) క్షుణ్న పఠనం
2) విస్తార పఠనం
3) మౌన పఠనం
4) ప్రకాశ పఠనం
- View Answer
- Answer: 3
5. భాషా నైపుణ్యాలన్నింటికీ ప్రథమ సోపానం ఏది?
1) భాషణం
2) పఠనం
3) శ్రవణం
4) లేఖనం
- View Answer
- Answer: 3
6. ఉపాధ్యాయుడు బోధిస్తుంటే వింటూ అక్షరాలను చూడకుండా అక్షర స్వరూపాన్ని గుర్తుచేసుకుంటూ రాసే లేఖనం?
1) దృష్ట లేఖనం
2) ఉక్త లేఖనం
3) సంక్షిప్త లేఖనం
4) వివరణాత్మక లేఖనం
- View Answer
- Answer: 2
7. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వర భేదం పాటిస్తూ వ్యక్తీకరిస్తే అది ఏ భాషణంలోకి వస్తుంది?
1) వాచిక చర్య
2) ఉక్త రచన
3) ఆంగికాభినయం
4) వాచికాభినయం
- View Answer
- Answer: 4
8. పద్య గద్యాత్మకమైన వాచక పుస్తకాల్లో విద్యార్థులు చేసే పఠనం ఏది?
1) ప్రకాశ పఠనం
2) క్షుణ్న పఠనం
3) మౌన పఠనం
4) విస్తార పఠనం
- View Answer
- Answer: 2
9. శిశుగీతాలు, అభినయ గేయాల ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఏ నైపుణ్యాన్ని పెంపొందిస్తాడు?
1) భాషణం
2) శ్రవణం
3) పఠనం
4) లేఖనం
- View Answer
- Answer: 1
10. వాచికాభినయంతోపాటు ఆంగికాభినయం కూడా ఉండే గేయాలను ఏమంటారు?
1) కథా గేయాలు
2) అభినయ గేయాలు
3) బాల గేయాలు
4) శిశు గేయాలు
- View Answer
- Answer: 2
11. విద్యార్థుల అందమైన దస్తూరిని ప్రామాణీకరించే సాధనాలను ఏమంటారు?
1) నికషలు
2) చెక్లిస్ట్
3) రేటింగ్ స్కేల్
4) లింగ్వాఫోన్
- View Answer
- Answer: 3
12. విద్యార్థుల్లో వాచిక చర్యను పెంపొందించడానికి ఉపకరించేవి ఏవి?
1) బాల గేయాలు (శిశు గేయాలు)
2) అభినయ గేయాలు
3) కథాకథనం – నాటకీకరణం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
13. ఒక విద్యార్థి దాశరథి బిరుదును ‘కవి బ్రహ్మ’ అని చెప్పాడు. అతడు చేసిన దోషం?
1) భాషాదోషం
2) భావదోషం
3) సాహిత్య దోషం
4) ఉచ్ఛారణ దోషం
- View Answer
- Answer: 2
14. విద్యార్థుల పఠన దోషాలను సవివరంగా క్రోడీకరించి తెలిపిన వారు?
1) రస్సెల్
2) బ్రూనర్
3) మెంజిల్
4) రైబర్న్
- View Answer
- Answer: 3
15. ‘రాత నేర్వడం అనేది చాలా కష్టమైన చర్య’ అని పేర్కొన్న విద్యావేత్త?
1) మాంటిస్సోరి
2) రైబర్న్
3) స్టాన్లీహాల్
4) బ్రూనర్
- View Answer
- Answer: 2
16. శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం అనేది ఎలాంటి దోషం?
1) భావదోషం
2) సమవేగ రాహిత్యం
3) భాషాదోషం
4) ఉచ్ఛారణ దోషం
- View Answer
- Answer: 3
17. విద్యార్థుల వాగింద్రియాల్లో లోపం ఉన్నప్పుడు ఏర్పడే దోషాలు?
1) భావ దోషాలు
2) ఉచ్ఛారణ దోషాలు
3) భాషా దోషాలు
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
18. విద్యార్థులకు పఠన నైపుణ్యం ఏ విధంగా అలవడుతుంది?
1) జన్మతః అలవడుతుంది
2) ప్రేరణ ద్వారా అలవడుతుంది
3) భాషణం వల్ల అలవడుతుంది
4) ప్రయత్న పూర్వకంగా అలవడుతుంది
- View Answer
- Answer: 4
19. ‘చూపుమేర, పలుకుమేర’ అంతరాన్ని మరో విధంగా ఏమని పిలుస్తారు?
1) వాఙ్మితి
2) వాఙ్నయనమితి
3) నయనమితి
4) పురోగమన వాఙ్నయనమితి
- View Answer
- Answer: 2
20. కింది వాటిలో భావ దోషం ఏది?
1) నన్నయ బిరుదు ‘కవిబ్రహ్మ’
2) తిక్కన ఆదికవి
3) వానమామలై వరదాచార్యులు ‘అభినవ తిక్కన’
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
21. ‘స్త్రీ మహిళా జాతిని తక్షణమే ఉద్ధరించాలి’ అనే వాక్యంలో ఉన్న దోషం ఏది?
1) భావ దోషం
2) భాషా దోషం
3) వ్యాకరణ దోషం
4) అలంకార దోషం
- View Answer
- Answer: 2
22. జ్ఞాన çసముపార్జనకు ఉపయోగపడే భాషా నైపుణ్యం?
1) శ్రవణం
2) భాషణం
3) పఠనం
4) లేఖనం
- View Answer
- Answer: 3
23. ‘ఇమ్ముగ జదువని నోరును... గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!’ అనే పద్యంలో ఏ భాషా నైపుణ్య ప్రాధాన్యాన్ని కవి వివరించాడు?
1) భాషణం
2) పఠనం
3) శ్రవణం
4) లేఖనం
- View Answer
- Answer: 2
24. ఉత్తమ పఠనం ప్రయోజనం ఏది?
1) లోకజ్ఞాన సముపార్జన
2) మూర్తిమత్వ వికాసం
3) జ్ఞాన సంపద విస్తరణ
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
25. కథా పద్ధతిని శ్రేష్టమైందిగా పేర్కొన్న మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు?
1) స్టాన్లీహాల్
2) రైబర్న్
3) మాంటిస్సోరి
4) బ్రూనర్
- View Answer
- Answer: 2
26. ‘భాష ఏక లక్షణం ఉన్న వస్తువు కాదు. అది సంక్లిష్ట దృగ్విషయం’ అని పేర్కొన్న వారు?
1) ఎస్.కె. కృష్ణస్వామి
2) ఎస్.కె. వర్మ
3) ఎన్. కృష్ణస్వామి
4) 2, 3
- View Answer
- Answer: 4
27. అక్షర చిత్రాలను చదివించడం వల్ల విద్యార్థుల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం ఏది?
1) శ్రవణం
2) పఠనం
3) లేఖనం
4) భాషణం
- View Answer
- Answer: 2
28. ప్రకాశ పఠనం ప్రయోజనం ఏది?
1) స్పష్టమైన ఉచ్ఛారణ సామర్థ్యం
2) చక్కని పఠన శైలి
3) భావస్ఫోరక పఠనం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
29. ప్రకాశ పఠనం అనేది ఏ దశ విద్యార్థులకు ఉపయోగం?
1) ప్రాథమిక దశ
2) మాధ్యమిక దశ
3) ఉన్నత పాఠశాల దశ
4) కళాశాల దశ
- View Answer
- Answer: 1
30. గ్రంథాలయాల్లో ఉపయోగించకూడని పఠనం?
1) క్షుణ్న పఠనం
2) మౌన పఠనం
3) ప్రకాశ పఠనం
4) విస్తార పఠనం
- View Answer
- Answer: 3
31. మౌన పఠనానికి పర్యాయ పదం?
1) అంతర పఠనం
2) నిగూఢ పఠనం
3) గంభీర పఠనం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
32. కింది వాటిలో మౌన పఠన ప్రయోజనం ఏది?
1) విస్తృత జ్ఞానప్రాప్తి
2) పాఠకుడికి మానసిక విశ్రాంతి
3) గ్రంథాలయాల్లో ఉపయోగం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
33. ‘కొన్ని పుస్తకాలను రుచి చూడాలి. మరికొన్ని పుస్తకాలను నమిలి మింగాలి. ఇంకొన్ని పుస్తకాలను నమిలి మింగడమేకాక జీర్ణం చేసుకోవాలి’ అని వ్యాఖ్యానించిన వారెవరు?
1) మహాత్మా గాంధీ
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) ఫ్రాన్సిస్ బేకన్
4) హెర్బర్ట్ రీడ్
- View Answer
- Answer: 3
34. క్షుణ్న పఠనం ద్వారా సమగ్ర జ్ఞాన సముపార్జన, భాషపై అధికారం సమకూరుతుందని పేర్కొన్నవారు?
1) గొడవర్తి సూర్యనారాయణ
2) హెర్బర్ట్ రీడ్
3) ఎస్.కె. వర్మ
4) ఫ్రాన్సిస్ బేకన్
- View Answer
- Answer: 4
35. క్షుణ్న పఠన ప్రయోజనం ఏది?
1) రసానుభూతి
2) ఆనందానుభూతి
3) భాషపై పట్టు, అధికార సాధన
4) పైవన్నీ
- View Answer
- Answer: 4