TET 2024 Guidelines : జనవరి 2 నుంచి టెట్ పరీక్షలు.. పకడ్బందీగా ఏర్పాట్లు.. 15 నిమిషాలకు ముందే..!!
సాక్షి ఎడ్యుకేషన్: టెట్.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష. పాఠశాలల్లో విద్యార్థులకు బోధించేందుకు ఎంపిక చేసే విధానంలో భాగమే ఈ పరీక్ష. ప్రతీ ఏటా నిర్వహించే ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నారు. అయితే, ఇప్పటికే అభ్యర్థులకు పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చేనెల రెండు నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం (సీబీఆర్టీ)లో రాతపరీక్షలు జరుగుతాయి.
TET 2024 Candidates : ప్రారంభం కానున్న టెట్ పరీక్షలు.. ఇప్పటికీ తప్పని తిప్పలు!!
వచ్చేనెల ఎనిమిది, తొమ్మిది, పది, 18 తేదీల్లో పేపర్-1, అదేనెల రెండు, ఐదు, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. ప్రతిరోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం తొమ్మిది నుంచి 11.30 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతాయి ఈ పరీక్షలు. అయితే, ప్రతీ పరీక్ష రాసే సమయంలో ప్రతీ అభ్యర్థి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం..
1. అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
2. బయోమెట్రిక్ ఏర్పాటు కారణంగా మహిళలు ఎవ్వరూ మెహందీ (గోరింటాకు) పెట్టుకొని రావొద్దు. మెహందీకి అనుమతి లేదు.
3. మొదటి విడత పరీక్షకు ఉదయం 7.30 గంటల నుంచి, రెండో విడతకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. మొదటి విడతకు ఉదయం 8.45 గంటలకు, రెండో విడతకు మధ్యాహ్నం 1.45 గంటలకు అంటే పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
4. అభ్యర్థులు తప్పనిసరిగా బ్లాక్/బ్లూ పెన్ను, హాల్టికెట్తోపాటు ఫొటో గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, పాన్, ఓటరు గుర్తింపు)ను వెంట తెచ్చుకోవాలి.
5. అభ్యర్థులు క్యాలికులేటింగ్ పరికరాలు, లాగరిథమ్ టేబుళ్లు, క్యాలిక్యులేటర్, పేజర్, సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వంటివి పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావడానికి అనుమతి లేదు. ఒకవేళ పట్టుబడితే, కఠిన చర్యలు తప్పవు.
Guest Teacher Posts : ఈ పాఠశాలలో గెస్ట్ టీచర్ పోస్టులు.. ఈ తేదీలోగా..!
6. మీ హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి.
7. ఒక రోజు ముందుగానే వెళ్లి పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి.
8. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు.
9. పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఆలస్యమైతే, లోపలికి అనుమతి ఉండదు.
10. నిబంధనలు తప్పితే.. చర్యలు తప్పవు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)