TET 2024 Hall Ticket Download : అందుబాటులోకి రానున్న టెట్ 2024 హాల్‌టికెట్.. డౌన్‌లోడ్ విధానం ఇలా..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బోధన విధులకు ఎంపికైయ్యేందుకు నిర్వహించే పరీక్ష టెట్.. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ టెట్ 2024 (II) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు అంటే, డిసెంబర్ 26 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కాగా, జనవరి 2వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం అయ్యి, జనవరి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Telangana TET 2024: తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం:
1. తెలంగాణ టెట్ 2024 అభ్యర్థులు schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. అక్కడ కనిపిస్తున్న 'Download TET Hall Tickets (II) 2024 పై క్లిక్ చేయాలి.
3. మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు పుట్టిన తేదీ, తదితర వివరాలను నమోదు చేసి submit బటన్‌పై క్లిక్ చేస్తే, మీ హాల్‌టికెట్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
TS TET Exam Dates and Syllabus 2025 : టెట్ 2025 సిలబస్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే.. ఇంకా..
టెట్ తేదీలు..
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. వచ్చే సంవత్సరం జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష ఉంటుంది. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష జరుగుతాయి. జనవరి 2వ తేదీన ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో సోషల్ స్టడీస్(పేపర్-2) జరగనుంది. జనవరి 5న ఉదయం సెషన్‌లో సోషల్ స్టడీస్(పేపర్ -2), మధ్యాహ్నం మ్యాథమేటిక్స్ అండ్ సైన్స్(పేపర్-2) పరీక్ష జరగనుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)