Constable to SI Success Story : కానిస్టేబుల్ టూ.. ఎస్ఐ..

ఎస్‌ఐ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఈ కానిస్టేబుల్. తెలంగాణ పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆగస్టు 6వ తేదీన (ఆదివారం) విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
Constable to SI Success Story

ఈ ఫ‌లితాల్లో.. వికారాబాద్‌ జిల్లా తాండూరు రూరల్ పరిధిలోని కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్ పెరుమాళ్ల లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 

☛ SI Inspirational Success Story : ఈ బల‌మైన సంక‌ల్పంతోనే.. ఎస్సై ఉద్యోగం కొట్టా.. ఎందుకంటే..?

కోట్‌పల్లి మండలం బార్వాద్‌ గ్రామానికి చెందిన పెరుమాళ్ల లక్ష్మీకాంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేశారు. 2020లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ ఉద్యోగానికి సన్నద్దమయ్యాడు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో పెరుమాళ్ల లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్ఐగా ఎంపికయ్యాడు. దీంతో తాండూరు రూరల్ సీఐ రాంబాబు, కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిలు ఎస్ఐగా ఎంపికైన లక్ష్మీకాంత్ రెడ్డిని సన్మానించారు.

☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..

☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..

#Tags