TS Police Constable Hall Tickets : కానిస్టేబుల్ పరీక్షలు హల్ టికెట్లు.. క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : కానిస్టేబుల్ పరీక్షల హాల్ టికెట్లును ఏప్రిల్ 24వ తేదీన‌ ఉదయం 8 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి (TSLPRB) ప్రకటించింది.
Police Constable Hall Tickets Details

ఏప్రిల్ 28వ తేదీ అర్ధరాత్రి 12.00 గంటల లోపు  వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఐటీ అండ్ సీవో) తుది పరీక్షలు ఏప్రిల్ 30వ తేదీ జరగనున్నాయి. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10.00 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరగనుంది. ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గం. వరకు నిర్వహిస్తారు. ఈ హాల్ టికెట్లును https://www.tslprb.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

☛ TS SI & Constable Final Exam Result Date 2023 : ఎస్సై, కానిస్టేబుల్ ఫైన‌ల్ ఫ‌లితాలు ఎప్పుడంటే..?

ఎస్సై తుది పరీక్షల‌ను కూడా..

మే నెల మొత్తం ఎస్సై తుది పరీక్ష మూల్యాంకన జరగనుందని అధికారులు తెలిపారు. ఈ పరీక్షల తుది ఫలితాలు ఒక కొలిక్కి వచ్చాక ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను జూన్‌లో పరిశీలించనున్నారు. జిల్లా కేంద్రాల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలకు తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

☛ TS SI General Studies Question Paper With Key 2023 : TS SI Final Exam General Studies Question Paper ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

ఈసారి తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిశీలించాలని క్రితంసారి నిర్ణయించారు. ఈసారీ అలాగే చేయనుండటంతో సమయం చాలావరకు ఆదా అయింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, అభ్యర్థుల నేర చరిత్రపై ఆరా.. ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే అభ్యర్థుల తుది జాబితా వెలువడనున్నట్లు తెలుస్తోంది.

ఎస్ఐ కీ విడుదల..


ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ ప‌రీక్షలు ఇటీవ‌లే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేశారు.ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలకు సంబంధించిన ఆబ్జెక్టివ్ పార్ట్ కు సంబంధించిన ప్రైమరీ కీ విడుదల చేశారు.

☛ TS SI Final Exam Telugu Question Paper With Preliminary Key 2023

☛ TS SI Final Exam Urdu Question Paper With Preliminary Key 2023

☛ TS SI Final Exam English Question Paper With Preliminary Key 2023

☛ TS SI Final Exam Question Paper With Key 2023: Arithmetic and Reasoning Exam QP With Key 2023

TS Police Constable Hall Tickets ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags