Telangana CM Revanth Reddy : త్వరలోనే ఈ శాఖల్లోని 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఇలా..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనున్నది. తెలంగాణ రాష్ట్రంలో 2024 ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
వీటిలో పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య శాఖలో 5 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఇప్పటికే పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. అలాగే కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించామని త్వరలోనే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. నిధులు, నియామకాలు, నీళ్లకోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఇంక నుంచి తెలంగాణలోని నిరుద్యోగులకు మంచి రోజులు రానున్నాయి.
Published date : 02 Feb 2024 07:50AM
Tags
- telangana cm revanth reddy announcement government jobs
- telangana 15000 police jobs
- telangana cm revanth reddy announcement police jobs 2024
- telangana cm revanth reddy announcement police jobs
- telangana cm revanth reddy announcement tspsc jobs
- Telangana CM promises to fill 200000 government job vacancies by year end
- 15000 police jobs in telangana
- 5000 medical jobs in ts
- 50000 medical jobs in telangana 2024
- GovernmentJobs
- EmploymentNews
- CongressGovernment
- sakshieducation updates