TS Constable Cut off Marks 2023 : టీఎస్ కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు ఇవే.. కొంపముంచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో కానిస్టేబుల్ పరీక్షల తుది ఫలితాలను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ఈ తుది ఫ‌లితాల్లో.. విచిత్రాలేన్నో.. చోటుచేసుకున్నాయి.
TS Constable Cut off Marks 2023 Details in Telugu

ఒకే కుటుంబం.. ఒకేసారి ఇద్ద‌రికి, ముగ్గురికి, న‌లుగురికి ఇలా కానిస్టేబుల్‌ ఉద్యోగాలు కొట్టారు. కేటగిరి వారీగా కటాఫ్ మార్కులను కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్ల‌డించింది. అలాగే ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడించింది. అభ్య‌ర్థులు ఈ ఫ‌లితాల‌ మీద క్లారిఫికేషన్ కోసం లాగిన్ అయి అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.

☛ TS Constable Cut off Marks 2023 కోసం క్లిక్ చేయండి

 టీఎస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి

కానిస్టేబుల్ ఉద్యోగాల్లో.. కొంపముంచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..

ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ మార్కుల కంటే, ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థుల కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

☛ TS Constable Jobs : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. ఒకే ఇంట్లో నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యారిలా.. ఇంకా చాలా కుటుంబాల్లో..

☛ Police Jobs 2023 : ఒకే కుటుంబం.. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు కొట్టారిలా.. ఎక్క‌డంటే..

16,604 కానిస్టేబుల్‌‌ పోస్టులకు పోలీస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం  తెల్సిందే. లక్షల మంది యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దీంతో ఈ నోటిఫికేషన్‌‌కు ఈడబ్ల్యూఎస్‌‌ రిజర్వేషన్లు వర్తించబోవని బోర్డు పేర్కొంది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌ వరకూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేవు. కానీ, ఫైనల్ ఎగ్జామ్‌‌కు ముందట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్‌‌లో సవరణలు చేశారు.

☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్‌.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

పది శాతం పోస్టులను ఈడబ్ల్యూఎస్‌‌ కింద కేటాయించారు. ఫైనల్ ఎగ్జామ్‌‌కు సంబంధించిన ఫలితాలను మూడ్రోజుల క్రితమే బోర్డు విడుదల చేసింది. ప్రతి జిల్లాలోనూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ తక్కువగా ఉంది. ప్రతి జిల్లా, ప్రతి కమిషనరేట్‌‌లోనూ అత్యల్ప కటాఫ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులదే ఉంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తక్కువ మంది ఉండడం, వారికి కేటాయించిన పోస్టులు ఎక్కువగా ఉండడం వల్లే వారి కటాఫ్ తక్కువగా ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు చెబుతున్నారు.

☛ Telangana Constable Success Stories : ఒకేసారి అక్కాచెల్లెళ్లు కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టారిలా.. ఇంకా వీళ్లు..

కటాఫ్ మార్కులను బట్టి చూస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల తమకు అన్యాయం జరిగిందని బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈడబ్ల్యూఎస్‌‌ రిజర్వేషన్లపై విమర్శలు చేస్తున్నారు. రెండు శాతం మంది పేదలు కూడా లేని ఓసీలకు, పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

 Constable Jobs Success Stories : కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. విచిత్రాలేన్నో.. ఒకే కుటుంబం నుంచి.. ఇద్ద‌రు.. ముగ్గురు.. ఇలా..

#Tags