AP High Court : ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షలో ఆ 8 ప్రశ్నల పూర్తి వివరాలను..

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదని, ఈ వ్యవహారాన్ని నిపుణుల కమిటీకి నివేదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
ap constable prelims exam 2023

ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

➤☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపిస్తూ... ప్రిలిమ్స్‌లో 8 ప్రశ్నలకు సరైన జవాబులను ఇవ్వనందున దీనిని నిపుణుల కమిటీకి పంపాల్సిన అవసరం ఉందన్నారు.

మార్చి 13వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయని, వాటికి పిటిషనర్లను అనుమతించేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలను తమ ముందుంచాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేశారు.

☛ AP Constable Events 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. కానిస్టేబుల్ ఈవెంట్స్ కొట్ట‌డం ఈజీనే..

 Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..

 Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

#Tags