TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. పలు విభాగాల్లో 16,614 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెల్సిందే.
Telangana Police Jobs Eligibility Criteria 2022 Overview

ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కింది అర్హతలు కల్గి ఉండాలి.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అర్హతలు ఇవే :
➤ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచే సిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
➤ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన వారు కూడా అర్హులే. 
➤ ఐటీ, కమ్యూనికేషన్‌ తదితర విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. 
➤ 2022 జూలై 1 నాటికి ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

వయోపరిమితి ఇలా ఉండాలి..
☛ కానిస్టేబుల్‌ పోస్టులకు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులు కాగా, ప్రభుత్వం మూడేళ్ల వయోపరిమితి సడలింపు అవకాశం ఇవ్వడంతో 25 ఏళ్ల వరకు వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు వయోపరిమితి సడలింపుతో 21 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

#Tags