Excise Constables: ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు శిక్షణ.. శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలు అవాస్తవం

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఎంపికైన 555 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకు 397 మంది జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారని, ఏప్రిల్‌ 13 వరకు గడువు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇప్పటికే విధుల్లో చేరిన అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్‌ 1 నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించినట్టు మార్చి 27న‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

614 ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా, 555 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 14న నియామక ఉత్తర్వులు అందజేశారు. ఎంపికైన అభ్యర్థులకు 3 నెలల పాటు శిక్షణ, మరో 45 రోజులు క్షేత్రస్థాయి శిక్షణ ఉంటాయి.

ఇప్పటికే 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణనిచ్చేందుకు షెడ్యూల్‌ ఖరారైందని, మిగతా అభ్యర్థులను జిల్లా టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, ఎక్సైజ్‌ స్టేషన్లు, చెక్‌ పోస్టుల్లో క్షేత్రస్థాయి శిక్షణకు పంపించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేసిన ఆరోపణలను పరోక్షంగా ఖండిస్తూ ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది.

#Tags