కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రశ్నపత్రాలపై అనుమానాలు ఇవే..

పంజగుట్ట (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్పిఆర్బీ) నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్ష పత్రాలు సైతం లీకైనట్టు అనుమానాలుండటంతో సిట్టింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేపట్టాలని కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులకు పోటీపడి అనర్హులుగా మిగిలిన అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.
కానిస్టేబుల్, ఎస్‌ఐ ప్రశ్నపత్రాలపై అనుమానాలు

మార్చి 19న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అభ్యర్థులు రాము, గిరి, రామ్‌ప్రసాద్, విజయ, శ్రావణి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రశ్నపత్రంలో వచ్చిన తప్పుడు ప్రశ్నలపై, షాట్‌పుట్, లాంగ్‌జంప్‌లో ఎంపికైనా డిస్‌క్వాలిఫై చేయడంపై ఇప్పటికే అభ్యర్థులందరం కోర్టును ఆశ్రయించామని తెలిపారు. కేసు కోర్టులో ఉండగానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఫిజికల్‌ టెస్టులు మొత్తం సీసీ కెమెరాల మధ్య జరిగిందని చెబుతున్న అధికారులు.. తాము షాట్‌పుట్, లాంగ్‌జంప్‌ ఎంపికయ్యామని.. సీసీ పుటేజీలు చూపించమని కోరితే నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రిలిమ్స్‌ మార్కులు ఎవరికెన్ని వచ్చాయో ఆన్‌లైన్‌లో పొందుపరిచారని, తెలంగాణలో ఎవరికీ తెలియజేయలేదని పేర్కొన్నారు. కానీ అత్యధికంగా కానిస్టేబుల్‌ పోస్టుకు 141 మార్కులు, ఎస్‌ఐ పోస్టుకు 133 మార్కులు వచ్చాయని ప్రకటించారని.. ఇన్ని మార్కులు రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. దీన్నిబట్టే ప్రశ్నపత్రం లీకైనట్టు అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం 48 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే అభ్యర్థులు కుటుంబ సభ్యులతో కలిసి ఎవరిళ్లల్లో వారు ఆమరణ నిరాహారదీక్షకు దిగుతారని హెచ్చరించారు. 

#Tags