శాతవాహన యుగం
1. కొంతమంది చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని ‘ధాన్యకటకం’ కాదని తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏది?
1) కొండాపురం
2) రాచకొండ
3) ఏలేశ్వరం
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 4
2. శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) పి.టి. శ్రీనివాస్
3) డాక్టర్ సుక్తాంకర్
4) డాక్టర్ కె.గోపాలాచారి
- View Answer
- సమాధానం: 3
3. శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందినవారని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) పి.టి. శ్రీనివాస్
3) కె.పి.జయస్వాల్
4) డాక్టర్ సుక్తాంకర్
- View Answer
- సమాధానం: 1
4. శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని అభిప్రాయపడినవారు?
1) వి.వి. మిరాసి
2) సుక్తాంకర్
3) పి.టి.శ్రీనివాస్
4) కె.పి.జయస్వాల్
- View Answer
- సమాధానం: 3
5. శాతవాహనుల మూలస్థానం పైఠాన్ ప్రాంతమని పేర్కొన్నవారు?
1) డాక్టర్ కె.గోపాలాచారి
2) కె.వి.జయస్వాల్
3) వి.వి.మిరాసి
4) డాక్టర్ సుక్తాంకర్
- View Answer
- సమాధానం: 1
6. కరీంనగర్ జిల్లాలో మహానగర శిథిలాలు బయల్పడిన ప్రాంతం ఏది?
1) కోటిలింగాల
2) కదంబపూర్
3) తొగర్రాయి
4) పెద్దబంకూర్
- View Answer
- సమాధానం: 2
7. నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు ఎవరు?
1) శ్రీముఖుడు
2) నారన
3) గోబద
4) సమగోపుడు
- View Answer
- సమాధానం: 3
8. శాతవాహన వంశ స్థాపకుడు, మొదటి పాలకుడు ఎవరు?
1) మొదటి శాతకర్ణి
2) కన్హుడు
3) రెండో శాతకర్ణి
4) శ్రీముఖుడు
- View Answer
- సమాధానం: 4
9. శ్రీముఖుడి పాలనా కాలం?
1) క్రీ.పూ. 231-200
2) క్రీ.పూ. 231-208
3) క్రీ.పూ. 231-205
4) క్రీ.పూ. 225-200
- View Answer
- సమాధానం: 2
10. శ్రీముఖుడు మొదట అవలంబించిన మతం?
1) జైనం
2) వైదికం
3) బౌద్ధం
4) శైవం
- View Answer
- సమాధానం: 1
11. పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్యవంశాన్ని నిర్మూలించి మగధలో క్రీ.పూ.187లో శుంగవంశాన్ని స్థాపించే సమయంలో పాలన కొనసాగిస్తున్న శాతవాహన రాజు?
1) శ్రీముఖుడు
2) కన్హుడు
3) మొదటి శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 3
12. రాప్సన్, బారువా అనే చరిత్రకారులు ఏ నదిని ‘కణ్ణబెణ్ణా’గా పేర్కొన్నారు?
1) గంగా
2) గోదావరి
3) కృష్ణా
4) వైన్ గంగా
- View Answer
- సమాధానం: 4
13. శ్రీముఖుడి తర్వాత రాజ్యాధికారానికి వచ్చిన పాలకుడు?
1) కన్హుడు
2) పులోమావి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) మొదటి శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
14. నానాఘాట్ శాసనాన్ని వేయించిందెవరు?
1) దేవీ నాగానిక
2) గౌతమీ బాలాశ్రీ
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
15. రెండో శాతకర్ణి మగధ, కళింగ ప్రాంతాలను కూడా ఆక్రమించి పాలన సాగించాడని ఏ పురాణంలో పేర్కొన్నారు?
1) మత్స్య
2) గరుడ
3) వరాహ
4) యుగ పురాణం
- View Answer
- సమాధానం: 4
16. ఏ పాలకుడి కాలంలో శక, యవన, కళింగ, పహ్లవాదులు శాతవాహనుల రాజ్య భాగాలను ఆక్రమించారు?
1) స్వాతికర్ణ
2) లంబోదరుడు
3) అపీలకుడు
4) మేఘస్వాతి
- View Answer
- సమాధానం: 2
17. ‘బృహత్కథ’, ‘వాత్స్యాయన కామసూత్ర’, ‘కావ్య మీమాంస’లో ఏ పాలకుడికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది?
1) శ్రీముఖుడు
2) మొదటి శాతకర్ణి
3) కుంతల శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 3
18. శర్వవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) కుంతల శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) హాలుడు
4) మొదటి పులోమావి
- View Answer
- సమాధానం: 1
19. శాతవాహనుల్లో 15వ రాజు?
1) హాలుడు
2) మొదటి పులోమావి
3) గౌరకృష్ణ
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
20. ‘గాథాసప్తశతి’ గ్రంథ రచయిత ఎవరు?
1) హాలుడు
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మొదటి పులోమావి
4) గౌతమీపుత్ర శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
21. ‘త్రి సముద్ర తోయ పీతవాహన’ అనేది ఎవరి బిరుదు?
1) మొదటి పులోమావి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) మొదటి శాతకర్ణి
- View Answer
- సమాధానం: 2
22. ఏ పాలకుడి కాలంలో తెలుగు ప్రాంతమంతా శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి
3) మొదటి పులోమావి
4) హాలుడు
- View Answer
- సమాధానం: 1
23. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలన్నింటినీ కలిపి పాలించిన చివరి శాతవాహన చక్రవర్తి ఎవరు?
1) రెండో శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) శివశ్రీ
4) రెండో పులోమావి
- View Answer
- సమాధానం: 2
24. శాతవాహన వంశానికి చెందిన చివరి పాలకులు రాజ్యాన్ని పంచుకొని పాలించారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలో ఉందని వారు పేర్కొన్నారు?
1) కౌశికీ పుత్ర శాతకర్ణి
2) నాలుగో పులోమావి
3) విజయశ్రీ
4) చంద్రశ్రీ
- View Answer
- సమాధానం: 1
25. ‘ధాన్యకటకం’ను రాజధానిగా చేసుకొని పాలించిన రాజు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి
3) నాలుగో పులోమావి
4) హాలుడు
- View Answer
- సమాధానం: 2
26. శాతవాహనుల్లో చివరి పాలకుడెవరు?
1) విజయశ్రీ
2) చంద్రశ్రీ
3) శివశ్రీ
4) నాలుగో పులోమావి
- View Answer
- సమాధానం: 4
27. నాలుగో పులోమావిని ఓడించే నాటికి శ్రీశాంతమూలుడు ఎక్కడ బలవంతమైన నాయకుడిగా ఉన్నాడు?
1) విదర్భ
2) విజయపురి
3) మహారాష్ట్ర
4) కళింగ
- View Answer
- సమాధానం: 2
28. శాతవాహన పాలకుల వరసక్రమం?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండో పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి
2) రెండో పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి, హాలుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి, రెండో పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి
4) హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, రెండో పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
29. శాతవాహనుల కాలంలో ద్రవ్యపరమైన ఆదాయాన్ని భద్రపరిచే వ్యక్తిని ఏమని పిలిచేవారు?
1) మహామాత్రులు
2) హిరణ్యకుడు
3) మహాసేనాపతి
4) నిబంధకారుడు
- View Answer
- సమాధానం: 2
30. శాతవాహనుల కాలంలో రాజాజ్ఞలు, రాజ్య వ్యవహారాలను పత్రాల్లో రాసి భద్రపరిచే వ్యక్తి?
1) నిబంధకారుడు
2) లేఖకుడు
3) హిరణ్యకుడు
4) అమాత్యుడు
- View Answer
- సమాధానం: 1
31. నిబంధకారులకు మరో పేరు?
1) అమాత్యులు
2) మహామాత్రులు
3) అక్షపటకులు
4) భాండాగారికులు
- View Answer
- సమాధానం: 3
32. కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట అనేది?
1) వైదిక స్థావరం
2) విద్యా కేంద్రం
3) బౌద్ధ స్థావరం
4) జైన స్థావరం
- View Answer
- సమాధానం: 4
33. శాతవాహన కాలంలో ‘కులపెద్దలను’ ఏ పేరుతో పిలిచేవారు?
1) గ్రామణి
2) నిబంధకారులు
3) అక్షపటకులు
4) గహపతులు
- View Answer
- సమాధానం: 4
34. శాతవాహనుల కాలంలో పంటలో ఎన్నో వంతును భూమిశిస్తుగా వసూలు చేసేవారు?
1) 6
2) 5
3) 4
4) 3
- View Answer
- సమాధానం: 1
35. శాతవాహన శాసనాల్లో కనిపిస్తున్న ‘స్కంధావారం’ అనే పదానికి అర్థం?
1) మిలటరీ క్యాంప్
2) కంటోన్మెంట్
3) రక్షణదుర్గం
4) రాజకోట
- View Answer
- సమాధానం: 1
36. శాతవాహన శాసనాల్లో కనిపిస్తున్న ‘కటకం’ అనే పదానికి అర్థం?
1) సైనిక శిబిరం
2) రక్షణ దుర్గం
3) రాజకోట
4) సైన్యాగారం
- View Answer
- సమాధానం: 4
37. ఖారవేలుడు ఏ నగరాన్ని గాడిదలతో తొక్కించి నేలమట్టం చేశాడు?
1) వినుకొండ
2) పిధుండ
3) హన్మకొండ
4) ఓరుగల్లు
- View Answer
- సమాధానం: 2
38. శాతవాహన కాలంనాటి చేతివృత్తిదారులైన ‘సాలెవారు’ అంటే?
1) వధకులు
2) కాసకారులు
3) కోలికులు
4) తిలపిష్టకులు
- View Answer
- సమాధానం: 3
39. శాతవాహనుల కాలంలో ‘గధికులు’ అనే చేతివృత్తి వారు చేసే పని?
1) మెరుగు పెట్టడం
2) కుండల తయారీ
3) కంచు పని
4) సుగంధ ద్రవ్యాల తయారీ
- View Answer
- సమాధానం: 4
40. శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే పన్ను పేరేమిటి?
1) కరుకర
2) శ్రేణి
3) శ్రేష్టి
4) కాలిక
- View Answer
- సమాధానం: 1
41. శాతవాహనుల కాలంలో ‘సేలవధకులు’గా ఎవరిని పేర్కొనేవారు?
1) కవులు
2) సాలెవారు
3) శిల్పులు
4) మేదరివారు
- View Answer
- సమాధానం: 3
42. శాతవాహనుల కాలంలో ‘పసకరులు’ అంటే ఎవరు?
1) కంచు పనివారు
2) సాలెవారు
3) శిల్పులు
4) మేదరివారు
- View Answer
- సమాధానం: 4
43. కులాలు వేటి నుంచి ఆవిర్భవించాయి?
1) వృత్తి సంఘాలు
2) ధర్మాలు
3) స్మృతులు
4) వర్తక సంఘాలు
- View Answer
- సమాధానం: 1
44. శాతవాహనుల కాలం నాటి ప్రజల ప్రధాన ప్రయాణ సాధనం?
1) గుర్రం బండి
2) ఎడ్ల బండి
3) కుక్కల బండి
4) ఒంటె బండి
- View Answer
- సమాధానం: 2
45. శాతవాహనుల కాలంలో విదేశాలతో వర్తకం చేసేవారిని ఏమని పిలిచేవారు?
1) శ్రేణులు
2) నిగమాలు
3) సార్దవాహులు
4) బిడారులు
- View Answer
- సమాధానం: 3
46. శాతవాహనుల ‘నాణేల’పై ప్రధానంగా కనిపించేది?
1) ఓడముద్ర
2) చాపముద్ర
3) వృషభం
4) సింహం
- View Answer
- సమాధానం: 1
47. శాతవాహనుల ‘టంకసాల’ నగరం ఏది?
1) కొండాపురం
2) పెదబంకూరు
3) ధూళికట్ట
4) హన్మకొండ
- View Answer
- సమాధానం: 1
48. శాతవాహనులతో ఎక్కువగా వర్తక వ్యాపారం నిర్వహించిన విదేశీయులు?
1) అరేబియన్లు
2) పర్షియన్లు
3) గ్రీకులు
4) రోమన్లు
- View Answer
- సమాధానం: 4
49. శాతవాహనులు సముద్ర తీరంతోపాటు ఏ నదుల ద్వారా కూడా విదేశీ వ్యాపారం నిర్వహించేవారు?
1) కృష్ణా, గోదావరి
2) మూసీ, గోదావరి
3) మూసీ, కృష్ణా
4) గంగా-గోదావరి
- View Answer
- సమాధానం: 2
50. ‘గౌతమీ బాలశ్రీ’ ఎవరి తల్లి?
1) మొదటి శాతకర్ణి
2) రెండో శాతకర్ణి
3) శ్రీముఖుడు
4) గౌతమీపుత్ర శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
51. శాతవాహనుల కాలంలో అధికంగా చెలామణిలో ఉన్న లోహం ఏది?
1) వెండి
2) బంగారం
3) రాగి
4) కంచు
- View Answer
- సమాధానం: 1
-
52. శాతవాహనుల కాలంలో చాలా తక్కువగా వాడుకలో ఉన్న లోహం?
1) వెండి
2) బంగారం
3) రాగి
4) కంచు
- View Answer
- సమాధానం: 3
53. శాతవాహనుల కాలం నాటికి ప్రధానంగా ఏర్పడిన వర్ణాలెన్ని?
1) 4
2) 5
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 1
54. శాతవాహనుల శాసనాల్లో ఏ వర్ణం వారి ప్రస్తావన ఎక్కువగా కనిపించదు?
1) క్షత్రియులు
2) వైశ్యులు
3) శూద్రులు
4) బ్రాహ్మణులు
- View Answer
- సమాధానం: 4
55. శాతవాహనులు మొదట అవలంబించిన మతం ఏది?
1) వైదికం
2) జైనం
3) బౌద్ధం
4) జొరాస్ట్రియన్
- View Answer
- సమాధానం: 2
56. శాతవాహనుల రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు?
1) నిగములు
2) ఆహారాలు
3) స్థలాలు
4) నాడులు
- View Answer
- సమాధానం: 2
57. శాతవాహనుల కాలం నాటి సామాన్య ప్రజలు అవలంబించిన మతం?
1) జొరాస్ట్రియన్
2) వైదికం
3) బౌద్ధం
4) జైనం
- View Answer
- సమాధానం: 3
58. ‘బుద్ధ పాదారాధన’ గురించి ప్రస్తావించిన గ్రంథం ఏది?
1) ఇండికా
2) గాథా సప్తశతి
3) లీలావతి కావ్యం
4) బృహత్కథ
- View Answer
- సమాధానం: 2
59. ‘రోమన్ శాసనసభ’లో దక్షిణ భారతదేశ వస్త్రాల గురించి ప్రస్తావించింది ఎవరు?
1) మెగస్తనీస్
2) పెరిప్లస్
3) ప్లీని
4) టాలమీ
- View Answer
- సమాధానం: 3
60. కిందివారిలో బౌద్ధ భిక్షువులకు భూదానాలు అధికంగా చేసిన పాలకుడు ఎవరు?
1) హాలుడు
2) మొదటి శాతకర్ణి
3) రెండో శాతకర్ణి
4) గౌతమీపుత్ర శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
61. క్రతు ప్రధానమైన మతం ఏది?
1) జైనం
2) వైదిక మతం
3) బౌద్ధం
4) పౌరాణిక హిందూమతం
- View Answer
- సమాధానం: 2
62. కిందివాటిలో ‘శివస్తోత్రం’తో ప్రారంభమైన గ్రంథం ఏది?
1) గాథా సప్తశతి
2) బృహత్కథ
3) లీలావతి కావ్యం
4) కాతంత్ర
- View Answer
- సమాధానం: 1
63. దక్షిణాపథంలో ‘పాశుపత శైవం’ ప్రాచుర్యం పొందిన కాలం ఏది?
1) క్రీ.శ. 4వ శతాబ్దం
2) క్రీ.శ. 3వ శతాబ్దం
3) క్రీ.శ. 2వ శతాబ్దం
4) క్రీ.శ. 1వ శతాబ్దం
- View Answer
- సమాధానం: 4
64. ‘లకువీశ శివాచార్యుడు’ వ్యాప్తికి తెచ్చిన మతం ఏది?
1) వైదికం
2) పాశుపత శైవం
3) వైష్ణవం
4) జైనం
- View Answer
- సమాధానం: 2
65. ‘లీలావతి కావ్యం’ను ఏ భాషలో రాశారు?
1) పైశాచీ
2) సంస్కృతం
3) తెలుగు
4) ప్రాకృతం
- View Answer
- సమాధానం:4
66. ‘వాసుదేవుడు’ ప్రధాన దైవంగా ఉన్న మతం ఏది?
1) బౌద్ధం
2) జైనం
3) శైవం
4) వైష్ణవం
- View Answer
- సమాధానం: 4
67. ‘వైష్ణవ మతం’ ఎవరి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చెందింది?
1) ఇక్ష్వాకులు
2) శాతవాహనులు
3) విష్ణుకుండినులు
4) చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
68. సంస్కృతంలో గ్రంథాలు రాయడం ఏ రాజవంశ కాలంలో ప్రారంభమైంది?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) విష్ణుకుండినులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 1
69. సంస్కృతంలో ‘కాతంత్ర’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరు?
1) హాలుడు
2) గుణాఢ్యుడు
3) శర్వవర్మ
4) మెగస్తనీస్
- View Answer
- సమాధానం: 2
-
70. శాతవాహనుల రాజభాష ఏది?
1) తెలుగు
2) ప్రాకృతం
3) పైశాచీ
4) సంస్కృతం
- View Answer
- సమాధానం: 2
71. శాతవాహనుల కాలంలో ‘ప్రాకృతం’ స్థానాన్ని క్రమంగా ఆక్రమించిన భాష ఏది?
1) తెలుగు
2) పైశాచీ
3) ఉర్దూ
4) సంస్కృతం
- View Answer
- సమాధానం: 4
72. పైశాచీ భాష నుంచే తెలుగు ఆవిర్భవించిందని అభిప్రాయపడింది ఎవరు?
1) సంగనభట్ల నర్సయ్య
2) డాక్టర్ పరబ్రహ్మశాస్త్రి
3) తిరుమల రామచంద్ర
4) డాక్టర్ దినేశ్ చంద్రసర్కార్
- View Answer
- సమాధానం: 3
73. ‘ప్రపంచ కథ’కు మూలం ఏది?
1) బృహత్కథ
2) గాథా సప్తశతి
3) లీలావతి కావ్యం
4) ఇండికా
- View Answer
- సమాధానం: 1
74. గుణాఢ్యుడు ‘బృహత్కథ’ గ్రంథాన్ని ఏ ప్రాంతంలో ఉండి రాశాడని పరిశోధకుల అభిప్రాయం?
1) కొలనుపాక
2) ద్రాక్షారామం
3) కొండాపురం
4) విజయపురి
- View Answer
- సమాధానం: 3
75. అత్త, పిల్ల లాంటి తెలుగు పదాలు కింది వాటిలో ఏ కావ్యంలో కనిపిస్తాయి?
1) కాతంత్ర
2) గాథా సప్తశతి
3) లీలావతి
4) మలయవతి
- View Answer
- సమాధానం: 2
76. ‘కవి వత్సలుడు’ అనే బిరుదున్న రాజు?
1) హాలుడు
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) మొదటి శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
77. హాలునితో సన్మానం పొందినవారెవరు?
1) వాత్సాయనుడు, నాగార్జునుడు
2) నాగార్జునుడు, శ్రీపాలితుడు
3) కుమారీలుడు, శ్రీపాలితుడు
4) కుమారీలుడు, నాగార్జునుడు
- View Answer
- సమాధానం: 3
78. హాలుడు సింహళ రాకుమార్తె ‘లీలావతి’ని వివాహమాడినట్లు ఏ గ్రంథంలో పేర్కొన్నారు?
1) గాథా సప్తశతి
2) లీలావతి కావ్యం
3) బృహత్కథ
4) కాతంత్ర
- View Answer
- సమాధానం: 2
79.తెలంగాణలో తొలి లిఖిత కవి, ఆయన రాసిన గ్రంథానికి సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
1) హాలుడు - గాథా సప్తశతి
2) గుణాఢ్యుడు - బృహత్కథ
3) శర్వవర్మ - కాతంత్ర వ్యాకరణం
4) కుతూహలుడు - లీలావతి కావ్యం
- View Answer
- సమాధానం: 2
80. ‘లీలావతి కావ్యాన్ని’ రాసిందెవరు?
1) హాలుడు
2) నాగార్జునుడు
3) కుమారీలుడు
4) కుతూహలుడు
- View Answer
- సమాధానం: 4
-
81. బహుభాషా కోవిదురాలైన ‘మలయవతి’ ఎవరి పట్టపురాణి?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) హాలుడు
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 2
-
82. శాతవాహనుల అధికార మతం ఏది?
1) జైనం
2) బౌద్ధం
3) శైవం
4) వైదికం
- View Answer
- సమాధానం: 4
-
83. తొలిసారిగా ఏ వంశ పాలకులు వారి పేరుకు ముందు తల్లి పేరును చేర్చుకున్నారు?
1) ఇక్ష్వాకులు
2) ఆర్యులు
3) మౌర్యులు
4) శాతవాహనులు
- View Answer
- సమాధానం: 4
-
84. తన పేరుకు ముందు తల్లి పేరు చేర్చుకొని పాలించిన మొదటి శాతవాహన చక్రవర్తి?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) స్కందశ్రీ శాతకర్ణి
4) విజయశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 2
-
85. మొదటి శాతకర్ణి భార్య పేరేమిటి?
1) దేవీ నాగానిక
2) గౌతమీ బాలాశ్రీ
3) మలయవతి
4) రుద్రదమనిక
- View Answer
- సమాధానం: 1
-
86. శాతవాహనుల రెండో రాజధాని ఏది?
1) కొండాపురం
2) అమరావతి
3) పైఠాన్
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 3
-