TS Inter Results 2024 Released: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాలు https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కాగా తెలంగాణలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు.
‘సాక్షి’లో ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను వేగంగా తెలుసుకునేందుకు ‘సాక్షి’దినపత్రిక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www. sakshieducation. com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది.
ఇంటర్ ఫలితాల 2024 కోసం 👇 క్లిక్ చేయండి :
☛ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
☛ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..