TS Inter Colleges Holidays 2023-24 : ఇంట‌ర్ విద్యార్థులకు సెల‌వులు ఇవే.. ఈ షెడ్యూల్ ప్ర‌కార‌మే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించిన అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌ను ఏప్రిల్ 1వ తేదీ (శ‌నివారం) విడుద‌ల చేసింది. వేస‌వి సెల‌వులు పూరైన త‌ర్వాత‌.. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నట్టుగా ప్రకటించింది.
TS Inter Academic Calendar 2023-24 Details

అలాగే జులై 1వ తేదీ నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయి.

☛ TS Inter Exams 2023 Results : టీఎస్ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల ఎప్పుడంటే..?

సెల‌వులు ఇలా..
అంతేకాకుండా ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు.. పండుగ సెల‌వుల‌ను కూడా విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వుల‌ను ఉండ‌నున్నాయి. కాలేజీలు తిరిగి అక్టోబ‌ర్ 26 న పునఃప్రారంభం కానున్నాయి. న‌వంబ‌ర్ 20 నుంచి 25 వ‌ర‌కు అర్థ‌సంవ‌త్స‌రం పరీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు. 2024 జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ఉంటాయ‌ని తెలిపింది. తిరిగి జ‌వ‌వ‌రి 17వ తేదీన‌ ఇంట‌ర్ క‌ళాశాల‌ల త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

➤ TS EAMCET 2023 : టీఎస్ఎంసెట్‌- 2023 ప‌రీక్ష తేదీలు మార్పులు.. కొత్త తేదీలు ఇవే..

ప‌రీక్ష‌లు మాత్రం ఇలా.. వేసవి సెలవులు మాత్రం..


ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌లు జ‌న‌వ‌రి 22 నుంచి 29 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి 6-13 మధ్య ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌ ఉంటాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి జూన్ 1, 2023న తిరికి కళాశాలు తెరుస్తారు.

Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

ఇంట‌ర్మీడియ‌ట్ షెడ్యూల్‌కు అనుగుణంగానే..
బోర్డు ప్రకటించిన షెడ్యూల్‌కు అనుగుణంగా మాత్రమే అడ్మిషన్లు జరగాలి. కాన్వాస్ చేయడానికి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, అలాంటి సిబ్బందిని నియమించడంలాంటి మార్కెటింగ్ వ్యూహాలను ఏ కళాశాల చేయకూడదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

చదవండి: ఇంటర్  స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

TS Inter Academic Calendar 2023-24 Details : 

#Tags