TS Inter Exams Fee Details 2022: ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులు ఖరారు
సాక్షి ఎడ్యుకేషన్ : వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఫీజుల వివరాలు ఇలా..
ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఆర్ట్స్(సీఈసీ, ఎంఈసీతో పాటు ఇతర కోర్సులు) విద్యార్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి, రెండో సంవత్సరం ఒకేషనల్, రెండో సంవత్సరం జనరల్ సైన్స్ విద్యార్థులు రూ.710 ఫీజు చెల్లించాలి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని బోర్డు తెలిపింది. రూ.100 ఫైన్‌తో డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు, రూ.1000 ఫైన్‌తో డిసెంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు, రూ.2000 ఫైన్‌తో డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
#Tags