Intermediate Exam Fees: ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. డిసెంబర్‌ 3వ తేదీ వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.
Intermediate Exam Fees

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ (జనరల్‌, ఒకేషనల్‌) రెగ్యులర్‌, ఫెయిలైన విద్యార్థులతో హాజరు మినహాయింపు ఉన్న ప్రయివేటు విద్యార్థులు కూడా ఫీజు చెల్లించాలని కోరారు.ఆలస్య రుసుం లేకుండా వచ్చేనెల మూడో తేదీ వరకు ఫీజు చెల్లించాలని కోరారు.

10th Class Pass Marks: విద్యార్థులకు షాక్‌ ఇచ్చిన సర్కార్‌.. బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో పాస్‌ మార్కులపై క్లారిటీ

ఆలస్య రుసుం రూ.100తో డిసెంబరు 10 వరకు, రూ. 500తో డిసెంబరు 17 వరకు, రూ. 1,000తో డిసెంబరు 24 వరకు, రూ. 2,000తో జనవరి 2 వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. కాగా తెలంగాణ‌లో ఇంట‌ర్ మొద‌టి . రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు మార్చి నెల రెండో లేదా మూడో వారం నుంచి జ‌రిగే అవ‌కాశం ఉంది. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags