TS Inter Sanskrit Syllabus : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సంస్కృత సిలబస్ ఇదే.. ఇలా రాస్తే..

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష సంస్కృత ప్రశ్న పత్రం కింది విధంగా ఉంటుంది. కొత్త‌గా ఉన్న ప్రశ్నాపత్రంలో మొదటి బిట్ నందు మూడు శ్లోకాలు ఇచ్చి ఏదేని ఒక శ్లోకానికి ప్రతిపదార్థం రాయమంటారు.
TS Inter Students

దీనికి 1 × 6 = 6 మార్కులు కేటాయించారు . రెండవ బిట్ ( II ) నందు మూడు వ్యాస రూప సమాధాన ప్రశ్నలు ఇచ్చి ఏదేని ఒక ప్రశ్నకు సమాధానం రాయమంటారు . దీనికి 1x6 = 6 మార్కులు కేటాయించారు.

☛ 2 వ బిట్‌లో గ‌ద్య‌భాగం నుంచి ఏదేని మూడు వ్యాసరూప ప్ర‌శ్న‌ల‌లో ఒక ప్రశ్నకు సమాధానం రాయమంటారు.

దీనికి 1x6 =6

☛ 4 వ బిట్ ఉపవాచకం నుంచి 4 ప్రశ్నలు ఇచ్చి ఏదేని రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు . ఒక ప్రశ్నకు 4 మార్కులు అనగా ఈ బిట్టుకు 2X4=8 మార్కులు కేటాయించారు .

☛ ప్రశ్న పత్రంలోని 5వ వ బిట్ నందు ఆ పత్రలేఖనానికి గాను 3 ప్రశ్నలలో ఏదేని ఒక సమాధానం రాయాలి . దీనికి 1x5 =5 మార్కులు కేటాయించారు.

ఇంట‌ర్ స్ట‌డీమెటీరియ‌ల్ కోసం క్లిక్ చేయండి

Good News : ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఇదే చివ‌రి అవ‌కాశం.. పూర్తి వివ‌రాలు ఇలా..​​​​​​​

ప్రశ్న పత్రంలోని XII , XIII బిట్లు సంధులకు సంబంధించినది . XII వ బిట్టులో 12 పదాలు ఇచ్చి వాటిలో , ఏవేని నాలుగు పదాలు విడదీసి సంధిపేరు రాయాల్సి ఉంటుంది . దీనికి గాను 2x4 = 8 మార్కులు కేటాయించ బడినవి . XIII బిట్ నందు 12 పదాలు విడదీసి ఇచ్చి వాటిలో నాలుగు పదాలు కలిపి రాసి , 20 సంధి పేరు రాయమంటారు . దీనికి గాను 2X4 =8 మార్కులు కేటాయించబడినవి . ప్రశ్నపత్రంలోని XVI వ బిట్ నందు ఐదు అశుద్ధమైన వాక్యాలు ఇచ్చి వాటిని 5 సరిచేసి రాయమందురు . దీనికి గాను మార్కులు కేటాయించబడినవి .

EAMCET 2022: జూన్ లో ఎంసెట్!.. సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..

మొదటి బిట్ కోసం పద్యభాగంలోని 3,4 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని నాలుగు శ్లోకాలకు ప్రతిపదార్థం నేర్చుకొన్నచో 6 మార్కులు , రెండవ బిట్ కొరకు పద్యభాగంలోని 2,6 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని వ్యాసరూప సమాధాన ప్రశ్న నేర్చుకున్నటైతే 6 మార్కులు , మూడవ బిట్ కొరకు గద్యభాగంలో 2,5 ఏదేని ఒక పాఠం నేర్చుకున్నట్లైతే 6 మార్కులు నాల్గవ బిట్ కొరకు ఉపవాచకంలోని 1,3 పాఠాలలో ఏదేని ఒక ప్రశ్న చదివినట్లయితే 8 మార్కులు,  పదకొండవ బిట్ ( XI) కోసం పాఠ్యపుస్తకంలోని మూడు పత్రాలలో ఏదేని ఒక పత్రం నేర్చుకున్నట్లైతే 5 మార్కులు ఉంటాయి.

XII, XIII కొరకు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఐదు సంధులలో ఏవేని నాలుగు సంధులు నేర్చు 16 మార్కులు, XVI వ బిట్ కొరకు పాఠ్య పుస్తకంలోని 15 వాక్యాలు నేర్చుకున్నట్లైతే 5 మార్కులు సులభంగా సాధించవచ్చు.

AP Inter Exams : ఏపీ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీలు మార్పు.. కొత్త తేదీలు ఇవే.. ప్రాక్టికల్స్ మాత్రం.

 

#Tags