Skip to main content

EAMCET 2022: జూన్ లో ఎంసెట్!.. సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..

ఎంసెట్‌–2022పై ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలైంది. ఏ తేదీల్లో నిర్వహించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. 7వ తేదీన జరిగే సమావేశంలో చర్చ అనంతరం పరీక్ష తేదీలపై ప్రాథమిక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి.
EAMCET 2022
జూన్ లో ఎంసెట్!.. సత్తా చాటేలా.. ప్రిపరేషన్ సాగించండిలా..

అనంతరం విషయం ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి వచ్చిన తర్వాత షెడ్యూల్‌ ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షల తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షలు మే నెలతో ముగుస్తాయి. మరోవైపు ఇంటరీ్మడియట్‌ పరీక్షలు కూడా మే మొదటి వారంలో పూర్తవుతాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జూన్ మొదటి వారంలో ఎంసెట్‌ నిర్వహించే యోచనలో అధికారులున్నారు. నెల రోజుల్లో ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు. జేఈఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. తొలి విడతలో ఎంసెట్‌లో సీటు దక్కించుకున్న విద్యార్థులు ఆ తర్వాత ఎన్ ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందుతారు. దీంతో రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కేటాయించిన సీట్లలో ఖాళీలు ఏర్పడతాయి. వీటన్నింటినీ జేఈఈ తుది రౌండ్‌ కౌన్సెలింగ్‌ తర్వాతే భర్తీ చేయాలని భావిస్తున్నారు. 

చదవండి: క్వీక్ రివ్యూ | బిట్ బ్యాంక్ | గైడెన్స్

అభ్యర్థులు పెరిగే అవకాశం 

ఈసారి ఎంసెట్‌ రాసే అభ్యర్థుల సంఖ్యపై అధికారులు దృష్టి పెడుతున్నారు. గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఇంటర్‌కు ప్రమోట్‌ చేశారు. ఇటీవల ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో కేవలం 49% విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు వీళ్లంతా ఇంటర్‌ సెకండియర్‌లో ఉన్నారు. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలున్నాయి. అయితే ఈ ఫలితాలతో సంబంధం లేకుండానే ఎంసెట్‌ రాసే వీలుంది. దీంతో గతం కన్నా ఈసారి ఎంసెట్‌ రాసే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసే అంశంపైనా చర్చించనున్నారు.

చదవండి: మోడల్ పేపర్లు | ప్రివియస్‌ పేపర్స్ప్రాక్టీస్ ప్రశ్నలు

ప్రిపరేషన్‌ సాగించండిలా..

ఎంసెట్‌లో సత్తా చాటి కోరుకున్న కాలేజీ, బ్రాంచ్‌లో/కోర్సులో ప్రవేశం పొందాలని లక్షలాది మంది ఉవ్విళ్లూరుతుంటారు. త్వ‌ర‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. టీఎస్‌ ఎంసెట్‌–2022 నోటిఫికేషన్‌ను విడుదల చేయ‌బోతోంది. దీంతో ప్రస్తుతం విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌పై దృష్టిపెడుతున్నారు.
టాప్‌ ర్యాంకే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. ఎంసెట్‌లో విజయానికి హార్డ్‌వర్క్‌తోపాటు సమయ పాలన, ప్రిపరేషన్‌ వ్యూహాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో.. విద్యార్థులకు ఉపయోగపడేలా నోటిఫికేషన్‌ సమాచారంతోపాటు సబ్జెక్టుల వారీగా ఫ్యాకల్టీ అందిస్తున్న ప్రిపరేషన్‌ టిప్స్‌..

కోర్సులు..

టీఎస్‌ ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌(డైరీ టెక్నాలజీ), బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హస్బండ్రీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్, బీఫార్మసీ, ఫార్మడీ(డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

చదవండి: College Predictor 2021 - TS EAMCET | AP EAPCET

పరీక్ష స్వరూపం..

ఎంసెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో మొత్తం 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్‌ మార్కులు లేవు.

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌..

సబ్జెక్టు ప్రశ్నలు మ్యాథమెటిక్స్‌ 80 ఫిజిక్స్‌ 40 కెమిస్ట్రీ 40 మొత్తం 160 అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌.. సబ్జెక్టు ప్రశ్నలు బయాలజీ(బోటనీ+జువాలజీ) 40+40=80 ఫిజిక్స్‌ 40 కెమిస్ట్రీ 40 మొత్తం 160 ప్రిపరేషన్‌ టిప్స్‌.. ప్రిపరేషన్‌ పరంగా చదవడంతోపాటు ప్రాక్టీసుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

పాత ఎంసెట్‌ ప్రశ్నపత్రాలను సాధించాలి

ప్రతి రోజూ కనీసం 100 ప్రశ్నలను సాధన చేయాలి. ప్రశ్నపత్రాల సాధనలో చేస్తున్న తప్పులను విశ్లేషించాలి. కష్టంగా అనిపించే ప్రశ్నలను గుర్తించి... రివిజన్‌లో వాటిపై దృష్టి సారించాలి. సులభంగా ఉన్న ప్రశ్నలను సైతం రివిజన్‌ చేయాలి. ఆరోగ్యం.. పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు శారీరక, మానసిక ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలి. మంచి సమతుల ఆహారం తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరు నుంచి ఏడు గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. ప్రిపరేషన్‌ పరంగా సానుకూలతను ప్రదర్శించాలి. తద్వారా పరీక్ష పరంగా ఆశించిన ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని అతివిశ్వాసంగా మారకుండా చూసుకోవాలి. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని గుర్తించాలి. మాక్‌ టెస్టులు.. రోజూ మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు పరీక్ష పరంగా స్వీయ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చు. మాక్‌టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రిపరేషన్‌ వ్యూహాలను మార్చుకోవాలి.

Published date : 04 Mar 2022 05:36PM

Photo Stories