5. నియంత్రణ - సమన్వయ వ్యవస్థ
ప్రచోదనం - ప్రతిస్పందన:జీవి పరిసరాలలోని మార్పునకు చూపించే సంకేతం దీనిని ఉద్దీపనలు (Stimules) అని కూడా అంటారు. జీవి ప్రచోదనానికి/ఉద్దీపనకు చూపించే ప్రతిచర్య.
మెదడు:-కేంద్రనాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఇది కపాలం అనే ఎముక పెట్టెలో ఇమిడి ఉంటుంది. ముందు మెదడు (మస్తిష్కం) మధ్యమెదడు (అనుమస్తిష్కం), వెనుక మెదడు (మెడుల్లా అబ్లాంగేటా) దీని ప్రధాన బాగలు. మెదడును కప్పి ‘మెనింజస్’ పొరలుంటాయి. దీని నుండి 12 జతలు కపాలనాడులు బయలు దేరుతాయి.
మస్తిష్క మేరు ద్రవం: - మెనింజస్ పొరల మధ్య ఉండే ద్రవం ఇది కపాలము. మెనింజస్‌లతో కలిసి మెదడును అఘాతాల నుండి కాపాడుతాయి.
వెన్నుపాము: మెదడు నుండి పృష్టితలం పొడవున నడుము వరకు వ్యాపించి ఉంటుంది. ఇది సమాచారం చేరవేయడంలో ప్రసార కేంద్రం (రిలేస్టేష్‌న్)గా పనిచేస్తుంది. అసంకల్పిత ప్రతీకార చర్యలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వెన్నుపాము నుండి 31 జతల కశేరు నాడులు వ్యాపించి ఉంటాయి.
నాడులు-రకాలు: సమాచారాన్ని చేర వేసే మార్గాలను బట్టి నాడులు 3 రకాలు.
1. జ్ఞాన నాడులు: అభివాహినాడులు అని కూడా అంటారు. ఇవి జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు సమాచారం పంపేనాడులు.
2. చాలకనాడులు (అపవాహినాడులు): మెదడు నుండి సమాచారాన్ని శరీరభాగాలకు పంపేనాడులు
3. సహసంబంధ నాడులు: (మిశ్రమ నాడులు): చాలక, జ్ఞాన నాడులను కలిపి సహసంబంధ నాడులు అంటారు. అంతస్రావీ గ్రంధులు: ఇది నాళాలు లేని గ్రంధులు కావున వినాళ గ్రంధులు అంటారు. ఇవి తమ రసాయనాలను నేరుగా రక్తంలోనికి పంపుతాయి. దీనిలో పిట్యుటరీ గ్రంధి శరీరంలో’ అతి ప్రధాన గ్రంధి’’ గా పేర్కొంటారు.
హార్మోనులు: ఇవి వినాళ గ్రంధులచే స్రవించబడే రసాయనాలు. ఇది రక్తం ద్వారా ప్రయాణించి వివిధ జీవక్రియలను నియంత్రిస్తాయి.
ఇన్సులిన్: క్లోమంలోని లాంగర్ హాన్స్ పుటికలు స్రవించే హార్మోన్. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తుంది. దీని లోపం - వలన చక్కెర (డయాబెటిస్ మిల్లిటస్) వ్యాధి వస్తుంది.
నాస్టిక్ చలనాలు: మొక్కలలో వివిధ చలనాలు ఉద్దీపనలకు అనుకూలమైన దిశలో జరుగుతాయి. కాని కొన్ని చలనాలు ఉద్దీపనలకు సంబంధం లేకుండా జరుగుతాయి. వీటినే ‘‘నాస్టిక్ చలనాలు’’ అంటారు.
5. నియంత్రణ - సమన్వయ వ్యవస్థ
విషయ విశ్లేషణ:
మన శరీరంలోని వివిధ విధులను అంతస్రావీ వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ కలిసి సమన్వయం మరియు నియంత్రిస్తాయి.
నాడీ వ్యవస్థ ప్రతి స్పందనలను 3 రకాలుగా విభజించబడ్డాయి.
1. ప్రతీకార చర్యలు
2. నియంత్రి త చర్యలు
3. అనియంత్రి చర్యలు
మానవ నాడీ వ్యవస్థను 2 భాగలుగా అధ్యయనం చేస్తాము.
1. కేంద్రనాడీ వ్యవస్థలో మానవ మెదడు, వెన్నుపాము ఉంటాయి. మెదడులో 3 భాగాలుంటాయి. అవి ముందు మెదడు, మధ్య మెదడు వెనుక మెదడు.
2. పరిధీయ నాడీ వ్యవస్థలో 2 రకాలుంటాయి.
1. కపాల నాడీ వ్యవస్థ
2. కశేరు నాడీ వ్యవస్థ
కపాలనాడులు: 12 జతలు, కశేరునాడు
(వెన్నునాడులు):31 జతలు
స్వంచోదిత నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థలో
1. సహానుభూత.
2. సహాను భూత పరనాడీ వ్యవస్థలు ఉంటాయి. ఇవి పరస్పర బౌతిక చర్యలకు కారణమవుతాయి.
నాడీకణం నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం. మానవనాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీకణాలున్నాయి.
ఒక నాడీకణం నుండి మరొక నాడీ కణానికి ప్రచోదనం ప్రసారమయ్యే భాగన్ని నాడీకణసంధి (సినాప్స్) అంటారు.
- మానవ దేహంలోని వినాళ గ్రంధుల నుండి స్రవించబడే హార్మోనులు ఒక భాగంలో ఉత్పత్తి అయి మరొక భాగంలో తమ విధులను నిర్వర్తిస్తాయి.
- వినాళ గ్రంధులలో - పీయుషగ్రంధి, థైరాయిడ్, పారాథైరాయిడ్, స్త్రీబీజకోశం, ముష్కాలు, అధివృక్క, క్లోమ గ్రంధులు ముఖ్యమైనవి
- పీయూషగ్రంధి మానవ శరీరంలో అతి ప్రధానగ్రంధి. దీనిని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇతర గ్రంధులను తన ఆధీనంలో ఉంచుతుంది.
- అడ్రినాలిన్ హార్మోన్ మానసిక ఉద్రేకాలను కలుగ జేస్తుంది.
- మొక్కలలో నిర్థిష్ట ఉద్దీపనాలు (ఉదా: కాంతి, స్పర్శ, రసాయనాలు) వలన జరిగే చలనాలను ‘‘అనువర్తనాలు’’ అంచారు.
- మొక్కలలో కూడా వివిధ రసాయనికి పదార్థల ద్వారా సమన్వయం జరుగతుంది.
- మొక్కల పెరుగుదలను ప్రభావితం చేసే (లేదా) పెరుగుదలను నిరోధించే పదార్థాలను పైటోహార్మోన్లు అంటారు. ఉదా: ఆక్సిన్లు, జిబ్బరెనిన్లు, ఇధిలీన్, సైటోకైనిన్లు మొదలగునవి.
4 మార్కుల ప్రశ్న జవాబులు
-
ప్ర. మొక్కలు ఏఏ అనువర్తనాలను చూపిస్తాయి? (AS-1)
మొక్కభాగలు బాహ్య ఉద్దీపనలకు లోనైనపుడు చలనాన్ని చూపిస్తాయి. ఈ చలనాలను ‘‘అనువర్తన చలనాలు’’ అంటారు. ఇవి 5 రకాలుగా ఉన్నాయి.
1. కాంతి అనువర్తనం: కిటికి దగ్గరలో పెరుగుతున్న తీగ మొక్కల్లో కాంతి సోకుతున్న వైపుకు పెరుగుదల కనిప్పిస్తుంది. ఇలా కాంతికి ప్రతిస్పందించడాన్ని ‘కాంతి అనువర్తనం’ అంటారు.
2.గురుత్వ అనువర్తనం: కొన్ని మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపు ప్రతి స్పందిస్తూ పెరుగుతాయి. దీనిని ‘గురుత్వావర్తనం’ అంటారు.
3. నీటి అనువర్తనం: మొక్కలు నీటికి ప్రతిస్పందిస్తూ నీరున్న వైపునకే చూపే చలనాలను ‘‘నీటి అనువర్తనం’’ అంటారు.
4. స్పర్శానువర్తనం: తీగజాతి మొక్కలలోని కాండాలపై సన్నని నులితీగలు ఏర్పడి ఒక అధారాన్ని పట్టుకొని కాండాన్ని ఎగబ్రాగనిస్తాయి. స్పర్శలేక తాకడం వలన జరిగే చలనాలను‘‘స్పర్శానువర్తనం’’ అంటారు.
ఉదా: అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ముడుచుకుపోతాయి.
5. రసాయనికి అనువర్తనం: తియ్యని రసాయనికి పదార్థం కలిగిన కీలాగ్రంపై పడిన పరాగరేణువులు ప్రతిస్పందించి కీలంలలో పరాగనాళం ర్పడుతుంది. ఫలధీకరణం కొరకు పరాగరేణువు అండాన్ని చేరుతుంది. ఇటువంటి రసాయనికి పదార్థాల ప్రతిస్పందనలను ‘రసాయనిక అను వర్తనం’’ అంటారు.
వీటి ఇంగ్లిష్ టర్మినాలజీ వరుసగా...1. Photo Tropism, 2. Geo tropism, 3. Hydrotropism, 4. Thigmo Tropism 5.Chemo Tropism.
- ప్ర: మొక్కలలో వేరు కాంతికి వ్యతిరేకంగా పెరుగుతాయనే విషయాన్ని తెలపడానికి ఒక ప్రయోగం సూచించండి. (ఎ.ఎస్-1, ఎ.ఎస్-3) (AS-1 & AS-3)
1. ఒక గాజు డానీ తీసుకొని మట్టితో నింపాను.
2. గాజూ జాడీ గోడ అంచుభాగన చిక్కుడు వత్తినం నాటాను.
3. జాడీని సూర్యరశ్మిలో ఉంచాను.
4. 4 నుండి 5 రోజులకు విత్తనం మొలకెత్తడం గమనించాను.
5. కాండం కాంతి వైపుకు పెరుగుతుంటే, వేరు మాత్రం కాంతికి వ్యతిరేకంగా పెరగడం గమనించాను.
6. జాడీని కదిలించి మొక్కను సమాంతరంగా ఉండేటట్లు చేశాను.
7. తర్వాత పరిశీలనలో కాండం పైకి కాంతివైపుకు, వేరు క్రిందకు పెరగడం గమనించాను.
- ప్ర: సినాప్స్ అంటే ఏమిటి? సమాచార ప్రసారంలో ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి? (AS-1)
1. నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైటులతో గానీ, ఆక్సాన్ తోగానీ కలిసే ప్రదేశాన్ని నాడీకణ సంధి (సినాప్స్) అంటారు.
2. నాడీకణసంధి ఒక నాడీకణం నుండి వేరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం.
3. రెండు నాడీకణాల మధ్య ఏవిధమైన జీవపదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ రసాయనాల ద్వారా కానీ, విద్యుత్ ప్రచోదనాల ద్వారా గానీ నాడీ కణం సంధి ద్వారా గాని సమాచారం ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారం అవుతుంది.
4. నాడీకణ సంధులు మెదడు, వెన్నుపాము చుట్టు ఉంటాయి. - ప్ర : మీరు డాక్టరుగారిని కలిసినపుడు చక్కెర వ్యాధి గురించి ఎటువంటి సందేహాలు అడుగుతారు? (AS-2)
జ: నేను డాక్టరు గారిని కలిసి చక్కెర వ్యాధి (డయాబెటిస్) గురించి తెలుసుకొనుటకు ఈ క్రింది ప్రశ్నలు అడుగాతాను.
1. . చక్కెర వ్యాధి దేని లోపం వలన వస్తుంది?
2. చక్కెర వ్యాధికి, క్లోమ గ్రంధికి ఉండే సంబంధం ఏమిటి?
3. చక్కెర వ్యాధి వలన కులగు దుష్పరిణామాలు ఎలా ఉంటాయి?
4. చక్కెర వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
5. చక్కెర వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
6. చక్కెర వ్యాధిని ఎలా నియంత్రించాలి? -
ప్ర: మానవ నాడీకణం పటం గీసి, బాగాలను గుర్తించుము. (AS-5)
-
ప్ర: మొక్కలలో ఉన్న వివిధ హార్మోనులు, వాటి ఉపయోగాలు తెల్పండి. (AS-1)
పైటోహార్మోనులు ఉపయోగాలు 1. అబ్‌సైసికామ్లం పత్రరంధ్రాలు మూసుకొనుట, విత్తనాల సుప్తావస్థ 2. ఆక్సీనులు కణం పెరుగుదల మరియు కాండం, వేరు విభేదనం 3. సైటోకైనిన్లు కణ విభజనను ప్రేరేపించడం, పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడం, ఆకులు రాలకుండా చేయడం, పత్రరంధాలు తెరుచుకునే విధంగా చేయడం. 4. ఇథిలీన్ ఫలాలు పక్వస్థితికి రావడం. 5. జబ్బిరెలిన్లు విత్తనాలు అంకురోత్పత్తి, కోరకాలు మొలకెత్తడం, కాండం పొడవుకావడం, పుష్పించడానిక ప్రేరేపించడం, ఫలాల అభివృధ్ధి, విత్తనాలలో సుప్తావస్థను తొలగించడం. - ప్ర: అడ్రినాలిన్ హార్మోన్‌ను ‘‘పోరాట పలాయన హార్మోన్’’ అని ఎందుకు అంటారు? (AS-1)
1. అధివృక్క గ్రంధి (అడ్రినల్) దవ్వ ప్రాంతం నుండి ఎడ్రినాలిన్ హార్మోన్ ఉత్పిత్తి అవుతుంది.
2. రక్తంలో ఆడ్రినలిన్ స్తాయి పెరిగనపుడు హృదయస్పందనరేటు, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతాయి.
3. దీనివల్ల ఆ జీవిలో కోపం, ఉద్రేకం, అతిగా స్పందించడం, పోరాట లక్షణాలు పెరుగుతాయి.
4. అడ్రినలిన్ స్థాయి తగ్గినపుడు జీవక్రియారేటు తగ్గి ఆ జీవి పారిపోవడం జరుగుతుంది.
5. మానసిక ఉద్రేకాలను ఈ హార్మోన్ నియంత్రిస్తుంది. కావున దీనిని ‘‘ మానసిక ఉద్వేగాలు కలుగజేసే హార్మోన్ (Fight and Flight hormone) అంటారు.
- ప్ర: ప్రతీకార చర్యాచాపం పటంగీసి, భాగలను గుర్తించండి. (AS-5)
2 మార్కుల ప్రశ్న జవాబులు
- ప్ర: ఉద్దీపనలకు, ప్రతిస్పందనలకు మధ్యగల తేడాలు తెల్పుము.(AS - 1)
ఉద్దీపన: ప్రతిస్పందన: 1. జీవి పరిసలాలలోని మార్పుకు, మార్పుకు సంబంధించిన ప్రచోదనం, 1. ఉద్దీపనలకు శరీరం చూపించు వివిధ ప్రతిచర్యలే ప్రతిస్పందన. 2. ఉద్దీపనలు యాంత్రికమైనవి. 2. నాడీప్రచోదనాల ఫలితంగా ఏర్పడతాయి 3. ఉద్దీపనలు చుట్టూ ఉన్న పరిసరాల నుండి వస్తాయి. 3. ప్రతిస్పందనలు శరీరంలోని వాడీవ్యవస్థ నుండి వస్తాయి. ఉదా: రాత్రి చలిగా ఉంది. ఉదా: దుప్పటి కప్పుకోవడం/సెట్టర్ ధరించడం. - ప్ర: మెదడును రక్షించే భాగలు ఏవి? (AS-1)
1. మెదడు కపాలంలోని ఎముకల పెట్టెలో ఉంటుంది.
2. మెదడును ఆవరించి పరాశిక, తాతికళ, మృద్వి అనే 3 పొరలు ఉంటాయి. వీటిని మెనింజస్ అంటారు.
3. ఈ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది.
4. కపాలం మరియు మెనింజస్‌లు కలిసి మెదడును అఘాతాల నుండి అకస్మాత్తు ప్రకంపనల నుండి కాపాడుతాయి.
- ప్ర: నీ సహచర విద్యార్ధి తరగతి గదిలో చేసే పనులను గమనించి వాటిలో ఏవి నియంత్రిక చర్యలో, ఏవి అని యంత్రిత చర్యలో తెల్పండి.(AS-2)
క్రమసంఖ్య
గమనించిన చర్య
చర్యరకం
1
పాఠం శ్రద్ధగా వినుట
నియంత్రిత చర్య
2
పాఠం వినేటపుడు కళ్ళు ఆర్పుట
అనియంత్రిత చర్య
3
పాఠం చదువుట
నియంత్రిత
4
ఉపాధ్యాయుని హాస్యానికి నవ్వటం
నియంత్రిత చర్య
5
తరగతిలో నిశ్శబ్ధాన్ని పాటించడం
నియంత్రిత చర్య
6
హఠాత్తుగా దగ్గడం, తుమ్మడం
అనియంత్రిత చర్య
7
అందరూ గుడ్‌మార్నింగ్ అనగానే అకస్మాత్తుగా లేచి నిలబడటం
అనియంత్రిత చర్య
8
తరగతి గదిలో పాటపాడుట
నియంత్రిత చర్య
-
ప్ర: నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలకు భేదాలు తెల్పండి? (AS-1)
నిబందన సహిత: నిబంధన రహిత 1. ఇవి వారసత్వముగా సంక్రమించవు 1. ఇవి వారసత్వంగా (పుట్టుకతో) వచ్చే ప్రతిచర్యలు
.2.ఇవి మెదడుతో ప్రమేయం లేకుండా జరుగుతాయి. 2. ఇవి కూడా మెదడు ప్రమేయం లేకుండానే జరుగుతాయి. 3. ఒకే పనిని అనేకసార్లు చేయడం ద్వారా ఫలితం పొందుతాము. ఉదా: జాతీయ గీతం అనగానే నిలబడటం. . 3. అకస్మాత్తుగా అలవాటుగా ప్రతి చర్యలు చూపుతాము. ఉదా: వేడి వస్తువు చేతికి తగలగానే వెనకకు లాక్కోవడం.
- ప్ర: నులి తీగలు ఆధారాన్ని పట్టుకొని తీగను పైకి లాగడాన్ని ఎలా ప్రశంసిస్తావు? (AS-6)
జ: దోస, కాకర, బీర వంటి మొక్కలలో నులితీగలు ఆధారాన్ని పట్టుకొని పైకి ఎగ బ్రాకటం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మొక్కలలో కాండం బలహీనంగా ఉండటం చేత, వాటికీ ఎగబ్రాకే శక్తి లేదు. నులితీగలు సన్నగా, దారాలుగా కాండం పై ఏర్పడి ఏదైనా ఆధారం వైపు ‘స్పర్శాను వర్తనం’ ద్వారా పెరుకుతూ పెనవేసుకుంటున్నాయి. ఈ విధంగా నులితీగలు స్ప్రింగులు ఆధారాన్ని చుట్టుకొని మొక్కను పైకి లాగడం అనేది అద్భుతమైన ప్రక్రియగా భావిస్తాను.
- ప్ర: హైపోథాలమస్ చేసే పనులేవి? (AS-1)
ముందు మెదడు, మధ్య మెదడు కలిసే భాగంలో హైపోధాలమస్ ఉంటుంది. ఇది పీయుషగ్రంధి కాడకు అతుక్కొని ఉంటుంది. ఇది హార్మోనులను స్రవిస్తుంది. ఉష్ణాన్ని, ఆకలిని దాహాన్ని , భావావేశాలను నియంత్రించే కేంద్రాలు హైపోధాలమస్‌లో ఉంటాయి.
- ప్ర: వెన్నుపాము ఏఏ విధులను నిర్వహిస్తుందని భావిస్తావు.? (AS-1)
1. శరీర భాగాలనుండి వార్తలను మెదడుకు చేరవేస్తుంది.
2. మెదడు నుండి వార్తలను సేకరించి, వీటిని శరీరభాగాలకు చేరవేస్తుంది.
3. అసంకల్పిత ప్రతీకార చర్యల యందు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
1 మార్కు ప్రశ్న జవాబులు
- నాడీ వ్యవస్థలో ఎన్ని విభాగాలున్నాయి?
జ: నాడీ వ్యవస్థలో 3 విభాగాలున్నాయి.
1.కేంద్ర నాడీవ్యవస్థ
2. పరిధియ నాడీ వ్యవస్థ
3. సహాను భూత నాడీ వ్యవస్థ - క్రియాత్మ కరెంటు అనగానేమి?
జ: నాడీ క ఉద్దీపనాలకు గురైనపుడు సైటాన్‌కు, ఎక్సాన్‌కు మధ్య సుమారు 55ఎమ్‌వి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనినే క్రియాత్మక కరెంటు లేదా నాడీ ప్రచోదనం అంటారు.
- మెనింజన్ అనగా నేమి? దాని పని ఏమి?
జ: మెదడును కప్పుతూ 3 పొరలుంటాయి. వీటిని మెనింజస్ అంటారు. ఈ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఇది మెదడును, వెన్నుపామును అఘాతాల నుండి రక్షిస్తుంది.
- అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటే ఏమిటి?
జ: కొన్ని ఉద్దీపనాలకు శరీరం వేగంగా, అప్రయత్నంగా చూపించే ప్రతి చర్యలను అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు. ఇవి మెదడుతో సంబంధం లేకుండా జరుగుతాయి.
- ప్రతీకార చర్యాచాపం అనగా నేమి?
జ: ప్రతీకార చర్యలు చూపించే నిర్మాణాత్మక, క్రియాత్మక యూనిట్‌ను ప్రతీకార చర్యా చాపము అంటారు.
- సినాప్స్ (నాడీకణ సంధి) అనగానేమి?
జ: ఒక నాడీ కణంలోని డెండ్రైటులు వేరొక కణంలోని డెండ్రైటులతో గాని, ఆక్సాన్‌తో గాని కలిసే ప్రదేశాన్ని సినాప్స్ అంటారు.
-
మొక్కలలో, ఆకులు, పుష్పాలు రాలిపోవుటకు కారణం ఏమిటి?
జ: మొక్కల నుండి ఆకులు, పుషాలు రాలిపోవుటకు ఆబ్‌సైసిక్ ఆమ్లం (ఎబిఎ) చర్య ఫలితమే ఆకు, పుష్పం, ఫలం వద్ద వేరు సరిచే ఒక పొర ‘అబ్సిసస్’ ఏర్పడుతుంది. దీని ఫలితంగా అవి రాలిపోతాయి. - మానవ మెదడు బరువు ఎంత?
జ: మెదడు దాదాపు 400 గ్రా బురువు ఉంటుంది. ఇది శరీరం మొత్తం బరువులో 2% గా ఉంటుంది.
- అనిషే ఫలాలు అనగానేమి? వీటికి ఏ రసాయన పదార్థం. అవసరమా?
జ: విత్తనాలు (గింజలు) లేని ఫలాలను అనిషేక ఫలాలు అంటారు. ఫలంలో విత్తనం ఏర్పడకుండా ‘జిబ్బరెల్లిన్’ అనే పైటో హార్మోన్ నిరోధిస్తుంది.
- మెదడును కప్పి ఉంచే పొరలేవి?
జ: మెదడును కప్పుతూ 3 పొరలుంటాయి.
1. పరాశిక, 2. తౌతికళ, 3.మృద్వి
- కపాల నాడులన్నింటిలో వేగస్‌నాడీ ఎందుకు ముఖమైనది?
జ: 12 జతలు కలిగిన కపాల నాడులలో వేగస్ నాడీ పదవనాడీ. ఇది హృదయ స్పందనాన్ని, క్లోమ గ్రంధిస్రావాలను నియంత్రిస్తుంది.
- అగ్రాధిక్వము అంటే ఏమిటి?
జ: అగ్రకోరము, పార్శ్వ కోరకాల పెరుగుదలను నిలిపివేసే అసాధారణ చర్యను ‘‘అగ్రాధిక్యము’’ అంటారు.
- ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం ఏది?
జ: 2,4, డై క్లోరో ఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం (2,4-డి)
- నిస్సల్ కణికలు అంటే ఏమిటి? ఇవి ఎక్కడ ఉంటాయి?
జ: నాడీ కణ నిర్మాణంలోని కణ దేహం (సైటాన్) ఉండే పెద్ద రేణువు. ఇవి ఉద్దీపనలకు ప్రకంపిస్తాయి.
- గ్లియల్ కణాల పని ఏమి?
జ: ఇవి నా డీ కణాలకు పోషక పదార్థాలు అందించే సహాయక కణాలు. ఇవి నాడీ కణాలకు రక్షణ కూడా ఇస్తాయి.
1/2 మార్కు ప్రశ్న జవాబులు
- శరీరంలో అతి ప్రధాన వినాళ గ్రంధి (master gland) ( )
ఎ. పీయుష గ్రంధి
బి. అడ్రినల్ గ్రంధి
సి. క్లోమము
డి. అవటు గ్రంది - మధుమేహ వ్యాధి (డయాబెటిస్ మల్లిటస్)కి సంబంధించిన గ్రంధి ()
ఎ. థైరాయిడ్
బి. క్లోమం.
సి. అధివృక్క
డి.పీయుష - మెదడు ఉపయోగించుకునే ఆక్సీజన్ శాతం ()
ఎ) 10%
బి)20%
సి)30
డి)35% - మెదడును కప్పి ఉంచే రక్షణ పొరలు ()
ఎ) కపాలము
బి)మెనింజస్
సి)మష్కిష్క మేరు ద్రవం
డి)అన్నియూ - మూత్ర పిండంపై వినాళ గ్రంధి ( )
ఎ) అడ్రినల్
బి)ముష్కాలు
సి)థైరాయిడ్
డి)స్త్రీబీజకోసం - ఫలాలు పండడానికి తోత్పడే హార్మోన్ ( )
ఎ) ఆక్సీన్
బి)ఇధీలిన్
సి)సైటోకైనిన్
డి)జిబ్బరెలిన్ - నులి తీగలలోని అను వర్తనం ( )
ఎ) ఫోటోట్రోపిజం
బి)ధిగ్నోట్రోపిజం
సి)కీమో ట్రోపిజం
డి) హైడ్రోట్రోపిజం - నాడీ అక్షాన్ని కప్పి ఉంటే నిరోధక పొర ( )
ఎ)ప్లాస్మాలెమ్మా
బి)న్వూకోలెమ్మా
సి)తెలుపు రంగు పదార్థం
డి)బూడిదరంగు పదార్థం - రుచిని గ్రహించడంలో ఏ నాడీ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది? ()
ఎ)అవకపాలనాడీ
బి)దృక్‌నాడీ
సి)5వ కపాలనాడీ
డి) 10 కపాలనాడీ - అనిషేక ఫలాలను ప్రోత్సాహించే హార్మోన్( )
ఎ)ఆక్సీన్
బి)జిబ్బరెలిన్
సి) సైటో కైనిన్
డి)అబ్‌సైసికామ్లము - లాంగర్ హాన్స్ పుటికలు వీటిలో ఉంటాయి ( )
ఎ)కాలేయం
బి)క్లోమం
సి) ఊపిరితిత్తులు
డి)మూత్రపిండాలు - అంతస్రావ మరియు బాహ్యగ్రంధిగా పనిచేసే మిశ్రమ గ్రంధి ( )
ఎ) పీయుషగ్రంధి
బి)అడ్రినల్
సి)థైరాయిడ్
డి)క్లోమగ్రంధి - మొక్కలలో నీటి నష్టంను తగ్గించే హార్మోన్ ( )
ఎ) ఇధిలిన్
బి)ఆక్సిన్లు
సి)ఎబిఎ
డి)సైటోకైనిన్‌లు - నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం()
ఎ) న్యూరాన్
బి)నెఫ్రాన్
సి)హార్మోన్
డి)రక్త కణం
జవాబులు: 1)ఎ ;2)బి; 3)బి; 4)డి; 5)ఎ; 6)బి; 7)బి; 8)బి; 9)డి; 10)బి; 11)బి; 12)డి; 13)సి; 14)ఎ;
- మెదడులో అతిపెద్ద భాగం....
- మానసిక ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్......................
- శరీరంలో రెండవ అతి పెద్ద గ్రంధి...............
- రక్తంలో హార్మోన్స్ కనుగొన్న శాస్త్రవేత్త.......................
- ఇన్సులిన్ హార్మోన్ లోపం వలన వచ్చే వ్యాధి..................
- మొక్కలలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్‌ను ..................అంటారు.
- శ్వాసక్రియ, నాడీ స్పందన వంటి కీలక క్రియలను..................నియంత్రిస్తుంది.
- రక్తనాళాల వ్యాసంలోని మార్పులను..................అంటారు.
- పోలియో వంటి వ్యాధులలో వైరస్‌చే నశింపబడే కణాలు ..................
- శరీరంలోని వివిధ చర్యలను నియంత్రించే మెదడులోని కేంద్రం..................
- మెదడును కప్పి ఉండే వెలుపలి, మధ్య పొరల ఉండే ద్రవము
- అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలో..................అధీనంలో ఉంటాయి.
- హృదయస్పందనలను నియంత్రించే ముఖ్యమైన కపాలనాడీ ..................
-
లాంగర్ హాన్స్ పుటికలను గుర్తించిన శాస్త్రవేత్త .................. అత్తిపత్తి మొక్క (touch me not) శాస్త్రీయనామం ..................
-
అత్తి పత్తి మొక్క (Touch me not) శాస్త్రీయనామం .................
జవాబులు: 1)మస్తిష్కం; 2) అడ్రినాలిన్; 3) క్లోమం; 4)స్టార్లింగ్; 5) డయాబెటిస్ మిల్లిటస్;.
6) ఫైటోహార్మోన్స్ ;7) మజ్జాముఖం; 8) వాసోమోటర్; 9) చాలకనాడులు; 10)మస్తిష్కము; .
11)మస్తిష్క మేరు ద్రవం ;12)వెన్నుపాము; 13)వేగస్‌నాడీ; 14) పావ్ లాంగర్ హాన్స్ ; 15) మైమోసా పూడికా.
గ్రూప్-ఎ |
|
గ్రూప్-బి |
1. ఆక్సీన్లు |
( ) |
ఎ. కణం పెరుగుదల |
2. సైటోకైనిన్లు |
( ) |
బి. కణవిభజన |
3. ఆబ్‌సైసికామ్లం |
( ) |
సి. విత్తనాల అంకురణ |
4. జిబ్బరెలిన్ |
( ) |
డి. ఫలాలు పక్వస్థితికి |
5. ఇధిలిన్ |
( ) |
ఇ. పత్రరంధ్రాలు |
|
|
ఎఫ్. ప్రత్యుత్పత్తి |
జవాబులు: 1) ఎ; 2)బి; 3)ఇ; 4) సి; 5)డి.
గ్రూప్-ఎ |
|
గ్రూప్-బి |
1.మస్తిష్కము |
( ) |
ఎ. 43 జతలు |
2. పరిధియనాడు |
( ) |
బి. 31 జతలు |
3. కపాలనాడులు |
( ) |
సి. తెలివి తేటలు |
4. కశేరు నాడులు |
( ) |
డి. శరీర సమాతాస్థితి |
5. అనుమస్తిష్కము |
( ) |
ఇ. 12 జతలు |
జవాబులు: 1)సి; 2)ఎ; 3)ఇ; 4)బి; 5)డి.