Anganwadi Centers: ప్రతి అంగన్‌వాడీలో ఓ టాయ్‌లెట్‌.. ఒకే విధమైన రూపంలో ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.

మౌలిక వసతులు కల్పించి ప్రీ ప్రైమరీ పాఠశాల స్థాయిలో వీటిని తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.

చదవండి: పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకు ఈ–పోస్‌...

ఈ మేరకు కేంద్రాల వారీగా నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలన్నీ ఒకే విధమైన రూపంలో ఉండే విధంగా రంగులు వేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సంచాలకురాలు నిర్మల కాంతి వెస్లీ, వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకురాలు బి.శైలజ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

#Tags