TS Tenth Class Public Exams Time Table 2024 : బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే... ఏఏ పరీక్ష ఎప్పుడంటే..
ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ ఓ ప్రకటనలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ కింది విధంగా ఉంటుంది.
తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
☛ 2024 మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు)
☛ 2024 మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్( హింది)
☛ 2024 మార్చి 21 న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
☛ 2024 మార్చి 23న మాథ్స్
☛ 2024 మార్చి 26 న సైన్స్ పేపర్ 1(ఫిజిక్స్)
☛ 2024 మార్చి 28న సైన్స్ పేపర్ 2(బయాలజీ)
☛ 2024 మార్చి 30న సోషల్ స్టడీస్
సైన్స్ పరీక్ష మాత్రం.. ఒకేరోజు వెంట వెంటనే
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు బదులు ఏడు పేపర్లుగా మారుస్తూ ఈసారి పరీక్షలు నిర్వహించనుంది. సైన్స్ పరీక్ష ఒకేరోజు వెంట వెంటనే నిర్వహించడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురై ఫలితాల మీద ప్రభావం చూపిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సైన్స్ సబ్జెక్టులను రెండు పరీక్షలుగా నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్ పార్ట్ – 1 గాను బయాలజికల్ సైన్స్ పార్ట్–2 గాను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. సైన్స్ సబ్జెక్టుల రెండు పేపర్లను ఉదయం 9:30 నుంచి 11.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
- టిఎస్ టెన్త్ క్లాస్ :
- మోడల్ పేపర్స్
- స్టడీ మెటీరియల్
- సిలబస్
- బిట్ బ్యాంక్
- మోడల్ పేపర్స్
- ప్రీవియస్ పేపర్స్
- టెక్స్ట్ బుక్స్
- ఏపీ టెన్త్ క్లాస్
పూర్తి వివరాలు ఇవే..