Reading Books: విద్యార్థులు పఠనాసక్తి పెంచుకోవాలి

కోనరావుపేట(వేములవాడ): విద్యార్థులు పఠనాసక్తిని పెంచుకోవాలని డీపీఆర్వో మామిండ్ల దశరథం కోరారు.

మండలంలోని కొలనూర్‌ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం కోసం పూర్వ విద్యార్థులు పుస్తకాలు అందజేశారు. పాఠశాలలో 1995–96 విద్యాసంవత్సరంలో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు నాంతాబాద్‌ చందూలాల్‌, మాజీ ఉపసర్పంచ్‌ ఓరుగంటి శంకర్‌, కట్కూరి సంతోష్‌, ఎగుర్ల తిరుపతి, సుద్దాల శ్రీనివాస్‌, మామిండ్ల దశరథం(డీపీఆర్వో) రూ.5వేల విలువైన పుస్తకాలను ప్రధానోపాధ్యాయుడు కోడూరి ఎల్లయ్యగౌడ్‌కు అందించారు.

చదవండి: Book Reading: పుస్తక పఠనంతో అపార జ్ఞానం

పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం, మెమొంటోలు అందించారు. పదో తరగతిలో ప్రతిభ చూపే విద్యార్థులకు రూ.3,016 (ప్రథమ), రూ.2,016(ద్వితీయ), రూ.1,016 (తృతీయ), బహుమతులు అందిస్తామని తెలిపారు.

#Tags