Tenth Class Public Exams 2025:పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు

Tenth Class Public Exams 2025:పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు

ఖిల్లాఘనపురం: పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇప్పటి నుంచే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, తెలంగాణ మోడల్‌ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని అర్థం కాకుంటే తిరిగి అడగాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ జయశంకర్‌, బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు కాళిదాస్‌, మునావర్‌ సుల్తానా, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఫరీద్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Top 10 Resources: పోటీ ప‌రీక్ష‌ల‌కు ఈ పది ఫాలో అయితే... మీదే ఉద్యోగం!

#Tags