10th Class Exams 2024: వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు

భూపాలపల్లి అర్బన్‌: ఈ విద్యాసంవత్సరంలో జరుగబోయే పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భవేష్‌మిశ్రా అన్నారు.

డిసెంబ‌ర్ 13న‌ సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023–24 సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 3,528 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారని, పరీక్షల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

చదువులో వెనుకబడిన విద్యార్థులను తక్షణమే గుర్తించి ప్రత్యేకంగా చదివించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు తప్పకుండా నిర్వహించాలన్నారు. అందులో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉన్న సమస్యలను నివృత్తి చేయాలన్నారు. గతంలో మాదిరిగానే స్పెషల్‌ క్లాస్‌లో చదువుకునే విద్యార్థులకు స్నాక్స్‌ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాంకుమార్‌, సెక్టోరియల్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు, ఎంఈఓలు, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

#Tags