Scout and Guides: ప్రతీ పాఠశాలలో స్కౌట్‌ యూనిట్‌

ఆదిలాబాద్‌: విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాగుణం పెంపొందించే స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని డీఈవో ప్రణీత అన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో బుధవారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలకు ఆమె అతిథిగా హాజరయ్యారు. స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ పతాకా న్ని ఆవిష్కరించారు.

చదవండి: Education: పేద విద్యార్థుల చదువుకు భరోసా

బెడెన్‌ పావెల్‌ దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఈవో మాట్లాడుతూ, విద్యార్థులు స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ ఉద్యమంలో భాగస్వాములయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇందులో ఉపాధ్యక్షుడు వి.ఆదినాథ్‌, కార్యదర్శి స్వామి, సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మి, ఆర్గనైజింగ్‌ కమిషనర్‌ మహేశ్‌, జిల్లా శిక్షణ కమిషనర్‌ నాగిరెడ్డి, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags