PRTUTS: అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని వినతి

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని పీఆర్టీయూటీఎస్‌ సంఘం నాయకులు కోరారు.

అదనపు కలెక్టర్‌ శ్యామలదేవితో పాటు డీఈవో ప్రణీతకు ఆగ‌స్టు 14న‌ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఠాక్రే బాలచంద్ర, కుడాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గుర్తించి ఆయా స్థానాల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు.

చదవండి: School Teachers : ఉపాధ్యాయుల సర్దుబాటు అంతా అస్తవ్యస్తం.. కారణం!

ఇటీవల బదిలీ పొందిన వారిని వెంటనే రిలీవ్‌ చేయాలని కోరారు. ఇందులో ఆదిలాబాద్‌రూరల్‌ మండల అధ్యక్షుడు ఆరే భాస్కర్‌, ఆదిలాబాద్‌ అర్బన్‌ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌ బోయర్‌ తదితరులున్నారు.

#Tags