Gadikota Govt School: 129 మందికి ఒకటే మరుగుదొడ్డి

రాయికల్‌(జగిత్యాల): ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 129 మంది విద్యార్థులు.. కానీ ఇంతమందికి ఒక్కటే మరుగుదొడ్డి.. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌లోని గడికోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది.

ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 129 మంది చదువుకుంటున్నారు. వీరిలో బాలికలు 65 మంది, బాలురు 64 మంది ఉన్నారు. అందరికీ కలిపి ఒకే మరుగుదొడ్డి ఉండటంతో.. దానిని 65 మంది బాలికలు రోజూ క్యూలో నిలబడి వినియోగించుకోవలసి వస్తోంది.

బాలురు ఆరుబయటే మూత్రవిసర్జన చేస్తున్నారు. పాఠశాలలో బెంచీలు లేకపోవడంతో నేలపైనే కూర్చుంటున్నారు. తరగతి గదులు కూడా సరిపడా లేవు.

చదవండి: Sports School: స్పోర్ట్స్‌ స్కూల్‌లో సౌకర్యాల కల్పనకు కృషి

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ స్పందించి యుద్ధప్రతిపాదికన మరుగుదొడ్లు, బెంచీలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని స్పష్టం చేశారు. 

#Tags