SSC 2023: విద్యార్థి హరీశ్‌ రిజల్ట్‌ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్‌’

కమలాపూర్‌: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచ్చిన ఘటనలో కోర్టు అనుమతితో పరీక్షలు రాసిన విద్యార్థి దండబోయిన హరీశ్‌ ఫలితంలో ‘మాల్‌ప్రాక్టీస్‌’అని వచ్చింది.
రిజల్ట్స్‌లో ‘మాల్‌ప్రాక్టీస్‌’ అని చూపిన అధికారులు (ఇన్‌సెట్‌)లో హరీశ్‌

ఏప్రిల్‌ 4న కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం ఔటైన ఘటనకు బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యా ర్థి హరీశ్‌ను విద్యాశాఖ అధికారులు ఐదేళ్ల పాటు డీబార్‌ చేశారు. దీంతో అతను ఇంగ్లిష్, గణితం పరీక్షలు రాయలేకపోయాడు. అతడి తరఫున ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలుచేయగా మిగిలిన పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతిచ్చింది.

చదవండి: Tenth Class: సైన్స్‌ పరీక్ష రాసిన విద్యార్థి హరీశ్‌

దీంతో హరీశ్‌ సామాన్య, సాంఘికశాస్త్రం పరీక్షలు రాశాడు. అయితే, మే 10న  వెలువరించిన ఫలితాల్లో హరీశ్‌ రిజల్ట్స్‌ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్‌’అని ఉంది. తన ప్రమేయం లేకున్నా బలి చేశారని, తన ఫలితం ప్రకటించి న్యాయం చేయాలని హరీశ్‌ అధికారులను వేడుకుంటున్నాడు. 

చదవండి: Tenth Class: డీబారైన విద్యార్థి ఊరట.. మిగతా పరీక్షలు రాసేందుకు అనుమతి

#Tags