Private Schools: అమానుషం.. విద్యార్థులపై యాజమాన్యాల ప్రతాపం
ఒకసారి చెవిపై తీవ్రంగా కొట్టడంతో విద్యార్థిని అస్వస్థతకు గురికాగా సదరు విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. అయినా తీరు మార్చుకోని యాజమాన్యం మరో విద్యార్థిని కర్రతో చితకబాదడంతో కాలిపై గాయాలయ్యాయి. ఈ ఘటనలో జిల్లా బాలల సంరక్షణ అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యాన్ని తీవ్రంగా మందలించారు.
చదవండి: Applications: ప్రైవేటు స్కూళ్లలో పేదల ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు
కౌటాల మండల కేంద్రంలోని
ప్రైవేట్ పాఠశాలలో ఇదే నెలలో ఫీజులు చెల్లించడం లేదనే కారణంతో పలువురు విద్యార్థులను ఎండలో నిలుచోబెట్టారు. సుమారు రెండు గంటల పాటు ఎండలో నిలుచున్న కారణంగా ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పై రెండు ఘటనలు ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు విద్యార్థులపై అమానుష ప్రవర్తనకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
చదవండి: Education News: ఇలా చేస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా చదువుకోవచ్చు.. అయితే వీరికి మాత్రమే
చట్టప్రకారం చర్యలు
చిన్నారులను ఫీజుల కోసం వేధిస్తే ప్రభుత్వ చట్టాల ప్రకారం ఏ విద్యాసంస్థ అయినా చర్యలు తీసుకుంటాం. బాలల న్యాయ సంరక్షణ చట్టాల ప్రకారం ప్రతీ పాఠశాల యాజమాన్యం నడుచుకోవాలి. జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఆయా విద్యాసంస్థలపై దృష్టి సారిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరిగితే జిల్లా బాలల సంరక్షణ శాఖకు సమాచారం ఇవ్వాలి.
– బూర్ల మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి
చింతలమానెపల్లి(సిర్పూర్): విద్యాబోధన చేయాల్సిన పాఠశాలలు విద్యార్థులకు శిక్షణాలయాలుగా మారుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల ధనార్జన ల క్ష్యాలకు విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారు. విద్య అనేది సేవగా ప్రభుత్వం గుర్తిస్తుండగా ప్రైవే టు పాఠశాలలు ఆదాయార్జనకు మార్గంగా ఎంచుకుంటున్నాయి. జిల్లాలో కాగజ్‌నగర్, అసిఫాబాద్ మినహా అన్నిమండలాలు గ్రామీణ మండలాలే.. ప్రైవేటు పాఠశాలల్లోని వసతులపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసి ప్రవేశాలు పెంచుకుంటున్నా యి. ఉన్నత స్థాయి బోధన, వసతులు ఉన్నాయని ప్రచారం చేసే యాజమాన్యాల ప్రకటనలకు విద్యార్థుల తల్లిందండ్రులు ఆకర్షితులవుతున్నారు. అడ్మిషన్ల కోసం ప్రైవేటు సిబ్బందిని నియమించుకుని స్థానిక ఏజంట్ల సహకారంతో కమీషన్ల ప్రాతిపదికన ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఫీజుల విషయంపై అస్పష్టమైన హామీలను ఇచ్చి అడ్మిషన్లు పెంచుకుంటున్నాయి.
వేధిస్తే కఠిన చర్యలు
చిన్నారులను వేధిస్తే బాలల సంరక్షణ, బాలల హక్కుల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాఠశాలలు, విద్యాసంస్థల్లో చిన్నారులపై వేధింపులను బాలల సంరక్షణ అధికారులు పరిశీలించి అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. వి ద్యాహక్కు చట్టం 2009 ప్రకారం సెక్షన్ 17(1), సెక్షన్ 17(2) ప్రకారం పాఠశాలల్లో శారీరక, మానసికంగా వేధించడం, హింసించడంపై నిషేధం విధించారు. బాలల న్యాయ చట్టం సెక్షన్ 82 ప్రకారం చి న్నారులపై శారీరక దండన అనేది నేరపూరితమని పేర్కొన్నారు. శారీరక దండనకు గురిచేస్తే మొదటి నేరారోపణపై రూ.10వేల జరిమానా విధిస్తారు. మళ్లీ అదే నేరం చేస్తే మూడు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు ఆస్కారం ఉంది. అలాగే 82(1) ప్రకారం సంస్థలో చేస్తున్న వ్యక్తి వేధింపులకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. 82(3) సెక్షన్1 ప్రకారం యాజమాన్యం విచారణకు సహకరించపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ నిర్వహణ బా ధ్యత వహించే వ్యక్తికి మూడేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష రూ.లక్ష జరిమానా విధిస్తారు. విద్యాహక్కు చట్టం బాలల న్యాయ సంరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలకు వారు బాధ్యులవుతారు.
ఫీజుల కోసం వేధింపులు
ఆరంభంలో ఫీజుల విషయమై ఒత్తిడి చేయని యాజమాన్యాలు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫీజుల విధానంపై అవగాహన లేకపోవడంతో పాఠశాల యాజమాన్యాల ఆగడాలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల అవగాహన లేమిని అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేకపోవడంతో పాఠశాల యాజమాన్యాలు తమ ప్రతాపాన్ని విద్యార్థులపై చూపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు వసూలు చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నాయి. సదరు ఉపాధ్యాయులు ఫీజులు వసూలు కాని విద్యార్థులను వేధిస్తున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఆర్థికపరమైన విషయాల్లో అవగాహన లేని చిన్నారులను ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫీజులు చెల్లించని విద్యార్థులను ఎండలో నిలబెట్టడం, కొట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.