English Language Skills: ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యాలు పెంచాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌: గిరిజన బాలబాలికల్లో ఇంగ్లిష్‌ భాషా సామర్థ్యాలు పెంచాలని డీటీడీవో రమాదేవి అన్నారు.

జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో తెలంగాణ ఎడ్యుకేషన్‌ లీడర్‌షిప్‌ సౌజన్యంతో ఇంగ్లిష్‌ బోధనపై ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణలో భాగంగా ఆగ‌స్టు 6న‌ డీటీడీవో పాల్గొని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

చదవండి: Spoken English Training: స్పోకెన్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై శిక్షణ

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో పబ్లిక్‌ పరీక్షలు కూడా ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటాయని పేర్కొన్నారు.

ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్‌, శిక్షణ క్యాంపు ఇన్‌చార్జి కృష్ణారావు, డీఎస్‌వో మీనారెడ్డి, ఏటీడీవోలు చిరంజీవి, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

#Tags