Bright Future: చదువుతోనే జీవితాల్లో వెలుగు: ఆర్‌ఎస్పీ

బోధన్‌: చదువుతోనే జీవితాల్లో వెలుగు వస్తుందని స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

జ‌నవ‌రి 26న‌ నిజామాబాద్‌ జిల్లా సాలూర మండల కేంద్రంలో స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో నిర్మించిన అంబేడ్కర్‌ విజ్ఞాన కేంద్రాన్ని (లైబ్రరీ) ఆయన ప్రారంభించారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చదవండి: Key to Success: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

ప్రతి పల్లెలో విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాను చదువుకోకపోతే పాలమూరు జిల్లాలోని తుంగభద్ర నదిలో చేపలు పట్టుకొని, కూలీనాలీ పనులు చేసు కుని బతికేవాడినని ప్రవీణ్‌ చెప్పారు. దేశంలో గుడు లతో పాటు బడులు ఉండాలని, బడులు ఖాళీగా ఉంటే జైళ్లు నిండుగా ఉంటాయన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప మేధా సంపన్నుడు అంబేడ్కర్‌ అని ప్రవీణ్‌ కొనియాడారు. దేశంలో నక్కలు, కుక్కలు, పులులను లెక్కిస్తున్నారని, కానీ బీసీ కుల గణనను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రవీణ్‌ విమర్శించారు. కుల గణన జరిగితే వారి జీవన స్థితిగతులు తెలుçస్తాయని, వారి లో ఎంత మంది చదువుకు దూరం ఉన్నారో తెలు స్తుందన్నారు.  

#Tags