Collector Tejas Nandlal Pawar: పాఠశాలకు వెళ్లి.. పాఠాలు బోధించి..

చిలుకూరు: కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆగ‌స్టు 21న‌ చిలుకూరు మండలంలోని నారాయణపురం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు.

ఐదో తరగతి గదిలోకి వెళ్లి ఇంగ్లిష్‌ పాఠాలు బోధించి విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకున్నారు. పాఠశాలలో మన ఊరు –మన బడి నూతన గది నిర్మాణ పనులు పరిశీలించారు. అమ్మ ఆదర్శ పథకం కింద చేపట్టిన వాష్‌ ఏరియాను పరిశీలించి 71 మంది విద్యార్థులకు 23 నల్లాలు ఎందుకు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ నిధులు వృథా చేశారని, సంబంధిత ఏఈకి షోకాజ్‌ నోటీసుల ఇవ్వాలని ఆదేశించారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

అంతకుముందు నారాయణపురంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్కూల్‌లో ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని గ్రామ కార్యదర్శికి సూచించారు.

అంతకుముందు సీతరాంపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ సలీమ్‌ షరీఫ్‌, గ్రామ కార్యదర్శులు అవినాష్‌రెడ్డి, కవిత , ఉపాధ్యాయులు ఉన్నారు.

#Tags