Change of School Working Hours: హైస్కూళ్ల పనివేళల్లో మార్పు

పెంచికల్‌ పేట్‌(సిర్పూర్‌): ఉన్నత పాఠశాలల పని వేళలు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

గతంలో ఉన్న పని వేళలను మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. నేటి నుంచి జిల్లాలోని 68 ఉన్నత పాఠశాలలు(లోక్‌ల్‌బాడీ) ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4.15గంటల వరకు పని చేయనున్నాయి.

చదవండి: Sports School: స్పోర్ట్స్‌ స్కూల్‌లో సౌకర్యాల కల్పనకు కృషి

గతంలో ఇలా..

గతంలో ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి 4.45 గంటల వరకు పని చేశాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల సమయంలో తేడా ఉండటంతో పనివేళల్లో మార్పు చేయాలని పలువురు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు విద్యాశాఖ ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం ఉదయం 9 గంటలకు మొదటి పీరియడ్‌ ప్రారంభమవుతుంది.

రెండో పీరియడ్‌ తర్వాత ఉదయం 10.30 నుంచి 10.45 వరకు విరామం ఉంటుంది. నాలుగో పీరియడ్‌ తర్వాత మధ్యాహ్నం 12.15 గంటల నుంచి ఒంటి గంట వరకు లంచ్‌బ్రేక్‌, ఆరో పీరియడ్‌ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 2.45 గంటలకు వరకు మరోసారి విరామం ఉంటుంది.

చివరి పీరియడ్‌ సాయంత్రం 3.30 గంటల నుంచి 4.15 గంటల వరకు కొనసాగనుంది.

నేటి నుంచి అమల్లోకి..

జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నూతన పనివేళలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలలు కొనసాగించాలి.

– పి.అశోక్‌, డీఈవో

#Tags