Department of Education: 21 నుంచి విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్షలు

పాడేరు: విద్యార్థులకు బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న సామర్థ్యాలను గుర్తించాలని, బేస్‌లైన్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వారిని ఎ,బి,సి,డి గ్రూపులుగా విభజించి వారి విద్యా ప్రమణాలను మెరుగుపర్చాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ అధికారులను ఆదేశించారు.

ఆగ‌స్టు 12న‌ ఐటీడీఏలోని తన చాంబర్‌లో విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఈనెల 21న బేస్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు.

17,18 తేదీల్లో స్కూల్‌ కాంప్లెక్స్‌ల పరిధిలోని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి బేస్‌లైన్‌ పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రశ్నపత్రాల తయారీ, జవాబు పత్రాల మూల్యంకనం పారదర్శకంగా జరగాలన్నారు.

చదవండి: Teachers Counselling : నేడు ఉపాధ్యాయుల స‌ర్దుబాటుపై కౌన్సెలింగ్‌..

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు, టీడబ్ల్యూ డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూవో ఎల్‌.రజని, ఎంఈవోలు కొమ్ము కృష్ణమూర్తి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

#Tags