TS gurukulam Jobs Notification 2023 : మార్చి నెలాఖ‌రులోగా 11,687 గురుకుల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో కొలువుల జాతర కొన‌సాగుతోంది.. మరో 11,687 వేల ఖాళీలకు గురుకుల నియామక బోర్డు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది.
TS Gurukulam Jobs 2023 Notification Details

వివిధ అనివార్య‌ కారణాలతోనే ఆ నోటిఫికేషన్లు విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. పలు ఖాళీల భర్తీకి అనుమతుల రాకపోవడంతో నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. అయితే మార్చి నెల మొదటి వారంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని తొలుత భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది.

TS Government Jobs : విద్యాశాఖలో 20 వేల పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

స్కూళ్లు తిరిగి ప్రారంభం నాటికి నియామక ప్రక్రియను..

ఈ నేపథ్యంలో నియామక బోర్డు కీలక తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మార్చి చివరిలోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని గురుకుల నియామక బోర్డు భావిస్తోంది. నోటిఫికేషన్ల విడుదల తర్వాత సాధ్యమైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి రాత పరీక్షకు మధ్య 4 నెలల సమయం ఇచ్చే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజులు సమయం ఇచ్చే అవకాశం ఉంది. సమ్మర్ హాలీడేస్ అనంతరం స్కూళ్లు తిరిగి ప్రారంభం నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి సిబ్బంది కొరత సమస్యను తీర్చాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది.

చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా..
తర్వాత అదనంగా మంజూరయ్యే పోస్టులకు రాత పరీక్ష నాటికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నియామక బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారీగా ఉద్యోగాలు ఉండడంతో నోటిఫికేషన్ కు సంబంధించి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు.

☛ త్వ‌ర‌లో టీఎస్ గురుకులం.. ఈ టిప్స్ పాటిస్తే మీకు జాబ్ త‌థ్యం..||TGT Best Preparation Tips

ఈ పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు..

రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికత, ఇతర సాంకేతిక అంశాలను జోడించి ట్రయల్‌రన్స్‌ నిర్వహిస్తోంది. ఈ పోస్టుల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న గురుకుల బోర్డు ఆ మేరకు సర్వర్‌పై ఒత్తిడిని తొలగించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం గురుకుల సొసైటీలు ఉద్యోగ ప్రకటనల జారీకి అవసరమైన సమాచారాన్ని గురుకులబోర్డుకు అందజేశాయి.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

#Tags