TS DSC: టెట్‌ పరీక్ష అయిపోగానే.. 20 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి అనుమతి !

సాక్షి, ఎడ్యుకేషన్‌: తెలంగాణలో ఇప్పటికే 30,453 వేల పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) అనంతరం మరో 20 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.
Telangana Teacher Jobs Recruitment 2022

టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు పరీక్షకు హాజరయ్యేలా డీఎస్సీ ప్రకటనకు మార్గం సుగమం కానుంది. ఉపాధ్యాయ పోస్టులు, ఇప్పటికే పరిపాలన అనుమతులు వచ్చిన‌ పోస్టులు పోను మిగిలిన మరో 30 వేల పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన‌ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగానే మిగిలిన పోస్టుల భర్తీకి పరిపాలన అనుమతులు ఇచ్చే యోచనలో ముందుకెళుతోంది.

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

 

టీఎస్‌ టెట్‌–2022 ముఖ్య‌మైన తేదీలు ఇవే..
☛ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
☛ ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 12 వరకు​​​​​​​
☛ టెట్‌ తేదీ: జూన్‌ 12, 2022
☛ పేపర్‌–1: ఉదయం 9:30 నుంచి 12:00 వరకు
☛ పేపర్‌–2: మధ్యాహ్నం 2:30 నుంచి 5:00వరకు
☛ ఫలితాల వెల్లడి: జూన్‌ 27, 2022
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://tstet.cgg.gov.in

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

TS TET 2022: అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

​​​​​​​ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

#Tags