TS TET Fees: టెట్ ఫీజు తగ్గించాలి.. గతంలో పేపర్‌కు కేవలం ఇంతే ఫీజు.. ఇప్పుడు మాత్రం ఇలా..
కాచిగూడ(హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజును రూ.2వేల నుంచి రూ.200లకు వెంటనే తగ్గించి నిరుద్యోగులకు ఉపశమనం కలిగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ఆయన మార్చి 27న సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో పేపర్‌కు కేవలం రూ.100, రెండు పేపర్లకు కలిపి రూ.200 ఫీజు ఉండేదని తెలిపారు.
చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్ పేపర్స్ | TS TET ప్రివియస్ పేపర్స్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఫీజులు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, పరీక్ష ఫీజుల పెంపును నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే నిరుద్యోగులు వివిధ పరీక్షలకు కోచింగ్‌ల కోసం అప్పుల పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
#Tags