TET Exam: టెట్‌కు ఏర్పాట్లు పూర్తి

మంచిర్యాల అర్బన్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. పేపర్‌–1కు 8,737 మంద అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా 33పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నా రు. పేపర్‌–2 కోసం 5,745మంది దరఖాస్తు చేసుకోగా 25 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపా రు. ఈనెల 15న ఉదయం 9.30నుంచి 12గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2.30నుంచి సా యంత్రం 5 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష ఉంటుందని వివరించారు. సందేహాలుంటే హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08736–252420, ఫోన్‌ నంబర్‌ 9440688034లో సంప్రదించాలని సూచించారు.

చదవండి: TS ICET Counselling: ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలి
మంచిర్యాలఅర్బన్‌: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని తపస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు కోరారు. తపస్‌ జిల్లా కా ర్యాలయంలో ఆదివారం మాట్లాడారు. 2018 పీఆ ర్సీకి సంబంధించి ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెండు నెలల పీఆర్సీ ఏరియర్స్‌, 18 నెలల బిల్లులకు 14 బిల్లులు ఇంకా ట్రెజరీ ఇ–కుభేర్‌లో మూలు గుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను, ఈ ఏడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన ఐఆర్‌ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బగ్గని రవికుమార్‌, ఆర్థిక కార్యదర్శి సమ్మయ్య, ఉపాధ్యక్షుడు నీలేశ్‌, ఎంవీ.గోపాల్‌రావు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

#Tags