Jobs in Medical Department: తెలంగాణలో భర్తీ కానున్న 5,348 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఐపీఎం, ఈఎంఈ, వైద్య విధాన పరిషత్‌ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో భారీ మొత్తంలో ఖాళీలను భర్తీకి సంబంధించిన ఇప్పటికే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ లో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1255 పోస్టులు భర్తీ చేయనున్నారు.కాగా వైద్య శాఖలో ఖాళీలను భర్తీకి చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

#Tags